Begin typing your search above and press return to search.
దూడను కుక్క కరిచింది.. కట్ చేస్తే.. 302 మంది టీకాలు వేయించుకున్నారు
By: Tupaki Desk | 21 May 2023 10:13 AM GMTచదివినంతనే కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్న ఈ ఉదంతం రోటీన్ కు భిన్నమైనదని చెప్పాలి. కుక్కకాటుకు దూడ చనిపోతే.. దాని తల్లి పాలు తాగిన గ్రామస్థులు భయంతో టీకా వేయించుకున్న వైనమిది. కుమురం భీం జిల్లాలోని చింతలమానెపల్లి మండల కేంద్రంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. భయం ప్లస్ ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే టీకాలు వేయించుకున్నారే కానీ.. మరేం కాదంటున్నారు. మరింత స్పష్టత కోసం అసలేం జరిగిందన్నది చూస్తే..
చింతలమానెపల్లికి చెందిన నానయ్య అనే పాల వ్యాపారి ఉన్నాడు. రెండు వారాల క్రితం అతడి వద్ద ఉన్న దూడను కుక్క కరిచింది. దానికి ఎలాంటి టీకా వేయించకపోవటమేకాదు.. విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కుక్క కరిచిన దూడ.. తల్లి గేదె పాలను నానయ్య అమ్మేశాడు. వారం తర్వాత దూడ చనిపోయింది. దూడ తన తల్లి గేదె పాలు తాగే క్రమంలో విషపూరితం అయ్యే డేంజర్ ఉందన్నప్రచారం స్థానికంగా జరిగింది. దీంతో.. భయానికి గురైన వారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీకాలు వేయించుకున్నారు.
దూడను కుక్క కరిస్తే.. దాని తల్లి గేదె పాలు తాగిన వారు టీకాలు వేయించుకోవటం ఏమిటన్న సందేహం రావొచ్చు. దీనికి చెబుతున్నదేమంటే.. కుక్క కాటుకు గురైన దూడ పాలు తాగే క్రమంలో.. పాల పొదుగు దగ్గర దాని పంటి ఘాటుతో చనిపోయిన దూడ తాలుకు విషం.. గేదె పాలలో కలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. స్థానిక ఎంపీడీవో స్పందించి.. పంచాయితీ ఆఫీసులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. పాలు తాగిన వారంతా టీకాలు వేయించుకోవాలని కోరారు.
దీంతో.. 302 మంది గ్రామస్థులు టీకా వేయించుకోవటానికి వచ్చారు. వారం.. పదిరోజుల వ్యవధిలో సదరు గేదె పాలను ఇంత మంది తాగారా? అన్న ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే.. తన వద్ద ఉన్న మిగిలిన గేదె పాలతో కలిసి.. అమ్మేయటంతో.. అతడి వద్ద పాలు కొనుగోలు చేసే వారంతా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టీకాలు వేయించుకున్నారు. అయితే.. ఈ ఉదంతంపై వైద్యులను సలహా అడిగితే.. వాడిన పాలు వేడి చేసిన తర్వాతే వినియోగించే కారణంగా ఎవరికి ఏమీ కాదని.. అయితే ప్రమాదం ఉంటుందన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవటం తప్పేమీ కాదని చెబుతున్నారు.