Begin typing your search above and press return to search.
పద్యం కారణంగా 26 బిలియన్ డాలర్ల నష్టపోయిన బిలియనీర్ !
By: Tupaki Desk | 12 May 2021 7:30 AM GMTమనకి తెలిసి చేసినా , తెలియక చేసినా కూడా కొన్ని సార్లు మనం చేసే కొన్ని తప్పుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. క్షణాల్లో కోట్ల ఆస్తి నష్టపోవాల్సి వస్తుంది. మనం చేసిన తప్పు సరిదిద్దుకునే లోపే , జరగాల్సిన నష్టం కాస్త ఎదో జరిగిపోతుంది. కాబట్టి ఆ తర్వాత బాధపడినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. తాజాగా చైనాకు చెందిన ఓ బిలియనీర్ ఇలాంటి పరిస్థితినే పేస్ చేశాడు. ఇంతకీ ఆయన చేసిన ఆ చిన్న తప్పు ఏమిటి అంటే .. వెయ్యేళ్ల నాటి ప్రాచీన కవితను ట్విటర్ లో షేర్ చేయడమే. చైనా బిలియనీర్, మీట్యుయన్ సీఈవో వాంగ్ జింగ్ ఈ కవితలోని కొన్ని పంక్తులను తన తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో చైనా మొట్టమొదటి చక్రవర్తి తనకు వ్యతిరేకంగా రేగుతున్న అసమ్మతిని అణచడానికి చేసిన తప్పుడు ప్రయత్నాల గురించి చెప్పడం జరిగింది.
దీనితో జింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని అనేక మంది అనుకోవడంతో , వాంగ్ జింగ్ సీఈవోగా ఉన్న మీట్యుయన్ కంపెనీ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్ల( మన ఇండియన్ కరెన్సీ లో రూ.18,365 కోట్లు) మేర పడిపోయింది. కాగా, గతేడాది చైనా వ్యాపార దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా చైనా విధానాలను బహిరంగంగా తప్పు పడ్డటం తో అతడిపై చైనా అనేక రకాలుగా ప్రతీకార చర్యలకు తెగబడింది. బిలియన్ డాలర్ల మేర జరిమానాలు విధించింది. అదే తరహాలో తమకు వ్యతిరేకంగా వచ్చిన మరికొంతమంది వ్యాపారులపై కూడా చైనా ప్రభుత్వం ఇలాంటి ధోరణులే అవలంబించిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జింగ్ ఈ కవితను షేర్ చేశాడనే అనుమానాలూ ఉన్నాయి. మరి ఇప్పుడు జింగ్ పై కూడా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.