Begin typing your search above and press return to search.
నగరాల్లో నివశించే వారికి అతిపెద్ద సమస్య అదే .. తాజాగా సర్వే లో వెల్లడి !
By: Tupaki Desk | 28 May 2021 8:42 AM GMTసాధరణంగా పల్లెల్లో నివశించే వారి జీవితాలతో పోల్చితే పట్నం లో ఉండే వారి జీవితాలు కొంచెం డిఫరెంట్. ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే పట్నంలో నివసించే వారు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడాల్సిందే. కరోనా దెబ్బకి అలాంటి వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఇంట్లో బయటకిపోతే కరోనా .. పోకపోతే పూటగడవడం కష్టం. ఈ నేపథ్యంలో పట్టణ జీవితాలపై భారత్ సహా పలు దేశాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారతదేశ పట్టణ ప్రజలను ఇప్పుడు ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్న అంశం కరోనా సంక్షోభమని ఆ సర్వేలో తేలింది.
దేశ పట్టణ ప్రజల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమను కరోనా అత్యంత ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలిపారు. 21 శాతం ఎక్కువ మంది కరోనా కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ‘ఐపీసోస్ వాట్ వరీస్ ది వరల్డ్ మంత్లీ’ ర్వహించిన ఈ సర్వేలో భారత పట్టణ ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న రెండో అంశం నిరుద్యోగ సమస్యగా తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది నిరుద్యోగ సమస్య తమను ఆందోళనకు గురిచేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ లోనూ ఇదే స్థాయిలో పట్టణ ప్రజలు నిరుద్యోగ సమస్య పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇక వీరిని ఆందోళనకు గురిచేస్తున్న మూడు అంశం హెల్త్ కేర్. దాదాపు 30 శాతం మంది హెల్త్ కేర్ తమను ఆందోళనకు గురిచేస్తున్నట్లు అభిప్రాయపడ్డారని ఆ సర్వే వెల్లడించింది.
హెల్త్ కేర్ పట్ల దేశ పట్టణ ప్రజల్లో ఆందోళన ఏప్రిల్ తో పోల్చితే మే లో 13 శాతం మేర పెరిగింది. ఆర్థిక అంశాలు, రాజకీయ అవినీతి తమను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలుగా 24 శాతం మంది అభిప్రాయపడగా,పేదరికం, సామాజిక అసమానతలని 21 శాతం పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేశారు. భారత్ సహా కెనడా, ఇజ్రాయిల్, మలేసియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా తదితర దేశాల్లో ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు 28 దేశాల్లో ఈ ఆన్ లైన్ సర్వేని నిర్వహించారు. భారత్ నుంచి ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది దేశం సరైన మార్గంలో వెళ్లడం లేదని అభిప్రాయపడగా, 52 శాతం మంది సరైన మార్గంలో వెళ్తున్నట్లు అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో 65 శాతం మేర ప్రజలు తమ దేశాలు సరైన మార్గంలో వెళ్తున్నట్లు భావించడం లేదని అభిప్రాయపడ్డారు