Begin typing your search above and press return to search.
ఉద్యోగి తప్పు.. చిక్కుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం!
By: Tupaki Desk | 26 May 2023 9:00 PM GMTఒక ఉద్యోగి చేసిన తప్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం.. కాషీవాజా కీ.. కరీవా ఇబ్బందుల్లో పడింది. జపాన్ లో ఉన్న ఈ ప్లాంట్ పున:ప్రారంభం భద్రతా కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మళ్లీ పున: ప్రారంభం కోసం అధికారులు పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యోగి చేసిన తప్పుతో మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది.
కాషీవాజా కీ కరీవా అణు విద్యుత్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ప్లాంట్ కు సంబంధించిన కీలకమైన పత్రాలను పోగొట్టాడు. దీంతో ఆ అణు విద్యుత్ కేంద్రానికి మరిన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ ఉద్యోగి.. సంబంధిత పత్రాల ను కారు మీద పెట్టి మర్చిపోయారని ప్లాంట్ ను నిర్వహించే 'టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వెల్లడించింది. తర్వాత వచ్చి చూస్తే కారు మీద అతడు పెట్టిన పత్రాలు కనిపించలేదని పేర్కొంది.
కాగా వాస్తవానికి అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో జపాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోనూ ప్రపంచంలోనూ తొలి అణుదాడికి గురయిన దేశం కూడా జపాన్ కావడమే అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో ఆ దేశం అప్రమత్తంగా ఉంటోంది.
జపాన్ లో ప్రస్తుతం 33 క్రియాశీల అణు రియాక్టర్లు ఉన్నాయని సమాచారం. జపాన్ జాతీయ అణు నియంత్రణ ప్రాధికార సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. 2011లో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో విపత్తు నేపథ్యంలో జపాన్ చాలా వరకు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేసింది.
ఇప్పుడు విద్యుత్ అవసరాల రీత్యా వాటి పునః ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతాపర మైన లోపాలు, కఠిన నియంత్రణ చర్యలు అడ్డంకిగా మారాయి.
ఈ నేపథ్యంలో జపాన్ లో అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రమైన 'కాషీవాజాకీ– కరీవా' ప్లాంట్‌లో చేపట్టిన భద్రతాపర ఏర్పాట్లు చాలవని ఇటీవల జపాన్ అణు పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. దానిపై విధించిన నిషేధాన్ని కొనసాగించాలని వారం క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక ఉద్యోగి ప్లాంట్ కు సంబంధించి కీలక పత్రాలు పోగొట్టడం కొత్త తలనొప్పికి దారి తీసింది.
కాగా 'కాషీవాజాకీ– కరీవా' ప్లాంట్ కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు ఇటీవల ఓ స్థానికుడికి లభించాయి. దీంతో ఉద్యోగి ఆ పత్రాలను పోగొట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పేపర్లను తిరిగి పొందేందుకు కాషీవాజాకీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మరోవైపు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం విషయంలో ఉద్యోగులు, మేనేజర్ల కు సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కీలక పత్రాలు, సమాచారం విషయంలో సిబ్బంది జాగరూకులై ఉండాలని సూచించింది. అజాగ్రత్తగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.