Begin typing your search above and press return to search.
అతిపెద్ద తోకచుక్క భూమి వైపు వస్తోంది..!
By: Tupaki Desk | 29 Sep 2021 3:30 AM GMTఇప్పటివరకు భూమ్మీదకు అంతరిక్షం నుంచి చాలా గ్రహశకలాలు దూసుకొచ్చాయి. అయితే, వాటి వల్ల మానవాళికి ఎటువంటి నష్టం కలగలేదు. ఈ నేపథ్యంలోనే ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోని అంశాలపై పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూమ్మీదకు త్వరలో భారీ తోకచుక్కటి రానుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ తోక చుక్క హేలీ తోక చుక్క అంటున్నారు. ఏడాదిలో రెండు సార్లు ఈ తోక చుక్క అవశేషాలు భూమి మీద ఉన్నవారికి కనిపిస్తాయట. ఇకపోతే ఈ వారమంతా సౌరశక్తి గురుత్వాకర్షణ శక్తికి హేలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది. ఈ తోకచుక్క 1682లో కనిపించినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి, గ్యారీ బెర్న్‌స్టెయిన్ తొలుత ఈ తోక చుక్కను గుర్తించారు. దానికి సీ/2014 యూఎన్271 అని పేరు పెట్టారు. అత్యంత భారీ పరిమాణంలో ఈ తోక చుక్క ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గుర్తించిన శాస్త్రవేత్తల్లో అతి పెద్ద తోక చుక్క ఇదేనని వారు చెప్తున్నారు. సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే ద్వారా తోక చుక్కకు సంబంధించిన డేటాను స్టడీ చేస్తున్నారు.
తొలుత దీనిని ఆస్టరాయిడ్(గ్రహశకలంగా) భావించారు. కానీ, అది ఆస్టరాయిడ్ కాదని, తోక చుక్క అని తర్వాత నిర్ధారించారు. ఈ తోక చుక్క 200 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ తోక చుక్క భూమిని ఢీ కొననుందా. అనేదానిపైన శాస్త్రవేత్తలు క్లియర్‌గా చెప్పలేకపోతున్నారు. సౌర కుటుంబంలోని గ్రహాలను అన్నిటినీ దాటుకుని వాటి గుండా ప్రయాణించి ఈ తోక చుక్క 2031వ సంవత్సరంలో సూర్యుడు, భూమికి దగ్గరగా వచ్చే చాన్సెస్ ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అత్యంత పెద్దగా ఉండే ఈ తోక చుక్క భూమి వైపు దూసుకొచ్చినపుడు ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని అంచనా కూడా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఖగోళ శాస్త్రవేత్తలు తోక చుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పరిశీలన చేస్తూనే దాని స్థితిగతులపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూమ్మీద ఉన్న వారికి ఈ తోక చుక్క నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, గతంలో చాలా సార్లు భూమ్మీదకు ఆస్టరాయిడ్స్‌తో పాటు అంతరిక్ష అవశేషాలు దూసుకొచ్చాయి. కానీ, ఏవి కూడా అంతగా భూమ్మీద పడి నష్టం చేకూర్చ లేవు. అంతరిక్షంలో జరిగే పరిణామాలపై అన్ని దేశాల ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు అంతరిక్షానికి సంబంధించి పలు కీలక పరిశోధనలు చేస్తున్నారు. గ్రహశకలాలు, తోకచుక్కలు ఇతర అవశేషాలతో భూమి, ఇతర గ్రహాల పరిస్థితులు, చంద్రుడు, అంగారక గ్రహం పైన పరిశోధనలు చేస్తున్నారు. అక్కడున్న పరిస్థితులపై స్పష్టమైన సమాచారం తెలుసుకునేందుకుగాను రోవర్స్‌ను పంపుతున్నారు. రోవర్ పంపిన డేటాను క్లియర్ కట్‌గా స్టడీ చేసి అంతరిక్షంతో పాటు ఇతర గ్రహాల స్థితిగతులను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.