Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
By: Tupaki Desk | 25 Feb 2021 9:02 AM GMTప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కంటెంట్ కు సంబంధించి మీడియా సంస్థలకు రుసుము చెల్లించేలా తయారు చేసిన కొత్త బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త మీడియా చట్టం ఇప్పుడు ఫేక్ బుక్ తోపాటు గూగుల్ కూడా గట్టి షాకిచ్చేలా ఉన్నాయి.
ఈ చట్టంతో ఇక నుంచి ఫేస్ బుక్ తోపాటు గూగుల్ సంస్థలు తమ ఫ్లాట్ ఫామ్ లలో ప్రచురించే న్యూస్ కంటెంట్ పై ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి పాల్ ఫ్లెచర్ తెలిపారు.
సోషల్ మీడియాతో వాణిజ్య సంబంధాల ఏర్పాటుపై గూగుల్, ఫేస్ బుక్ ముందుకు వెళ్లడం సంతోషం. ఆస్ట్రేలియాలో ప్రజాప్రయోజన జర్నలిజం మరింత మెరుగ్గా కొనసాగేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఆ దేశ మంత్రి తెలిపారు.
ఈ బిల్లును ఫేస్ బుక్ సహా గూగుల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ ఆస్ట్రేలియాలో వార్తలను తన సామాజికవేదికపై పంచుకోవడాన్ని కొద్దిరోజుల పాటు నిలిపివేసింది.
ఇక తాజాగా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో ఇదే తరహాలో బిల్లులు తేవాలని ఆలోచిస్తున్న కెనడా, బ్రిటన్ వంటి దేశాలకు ఇది బలం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.