Begin typing your search above and press return to search.
యాపిల్ నుంచి క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది
By: Tupaki Desk | 28 March 2019 1:30 AM GMTయాపిల్ ఏదైనా వస్తువుపై కన్నేస్తే.. అందులో నెంబర్ వన్ అవ్వడమే. ఇన్నాళ్లు కంప్యూటర్ - ఫోన్లు - ల్యాప్ ట్యాప్ ల్లో సంచలనం సృష్టించిన యాపిల్.. ఇప్పడు కొత్త మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అదే క్రెడిట్ కార్డ్ సెక్షన్. ఈ సెక్షన్ ద్వారా తొలిసారి ఆర్థిక లావాదేవీల్లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటోంది. యాపిల్ కార్డ్ పేరుతో క్రెడిట్ కార్డుని రీసెంట్‌గా లాంచ్ చేసింది. అయితే.. ఇది అన్ని బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డు లాంటిది కాదు. ఇది ఫిజికల్‌గా అంటే.. మన చేతిలోనో, మన వ్యాలెట్ లోనో ఉండదు. ఐఫోన్లే వాడేవారే ఫోన్లే క్రెడిట్ కార్డులుగా పనిచేస్తాయి.
యాపిల్ క్రెడిట్ కార్డు సర్వీస్ ను యాక్టివేట్ చేసుకుంటే వెంటనే ఓ నంబర్ క్రియేట్ అవుతుంది. కానీ అది యూజర్లకు కనిపించదు. కాకపోతే ఆ నంబర్, ఇతర సమాచారం అంతా యాపిల్ పే లో సెక్యూర్ గా స్టోర్ అవుతుంది. ఈ క్రమంలో యాపిల్ పే ఉన్న మర్చంట్ల దగ్గర యాపిల్ కార్డుతో బిల్లు చెల్లింపులు చేయవచ్చు. యాపిల్ పే లేని చోట కార్డును వాడుకునేందుకు వీలుగా ఫిజికల్ కార్డును కూడా యాపిల్ అందించబోతోంది. ఈ వ్యాపారంలోకి ఇప్పుడే ఎంటర్ అవుతుంది కాబట్టి ఇందుకు ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేవని ప్రకటించింది యాపిల్. ఈ కార్డులు వాడే వారికి రివార్డులు - క్యాష్ బ్యాక్ ను కూడా అందివ్వనున్నారు. అన్నింటికి మించి కార్డు బిల్లు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం అయినా అధిక రుసుం వసూలు చేయబోమని యాపిల్ ప్రకటించింది. ఇక ఈ కార్డు ఈ మే నుంచి మొదటగా అమెరికా యాపిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఏ వ్యాపారం మొదలుపెట్టినా అది తనకు మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా ఉంచుకోవడం యాపిల్ స్పెషాలిటీ. అందుకే.. ఇప్పుడు క్రెడిట్ కార్డుల్లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఇది కూడా క్లిక్ అయితే రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒకటి మాత్రం వాస్తవం. యాపిల్ వస్తే మిగిలిన వాళ్లు తప్పుకోవాల్సిందే.