Begin typing your search above and press return to search.

క‌న్నాకు ఆ పార్టీనే బెట‌ర్‌.. అభిమానుల మాట‌!

By:  Tupaki Desk   |   19 Feb 2023 4:23 PM GMT
క‌న్నాకు ఆ పార్టీనే బెట‌ర్‌.. అభిమానుల మాట‌!
X
ఇటీవ‌ల బీజేపీకి రాజీనామా చేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌ర‌లోనే పార్టీ మారుతారంటూ.. వార్త‌లు వ‌స్తు న్నాయి. ఆయ‌న టీడీపీ చెంత‌కు చేరుతారంటూ.. డేట్లు.. కూడా వ‌చ్చేశాయి. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఎవ‌రూ కాద‌నరు. కానీ, ఆయ‌న అభిమాల మాట.. చేత వేరేగా ఉంది. ప్ర‌స్తుతం క‌న్నా చూపంతా టీడీపీ వైపు ఉందని అంటున్నా.. పార్టీ అధినేత అందుకు సానుకూలంగానేఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి క‌న్నాకు అనుకూలంగా లేద‌నేది వాస్త‌వం.

గుంటూరులో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన నాయ‌కుడిగా క‌న్నాకు పేరుంది. మంత్రిగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయ‌నకు గుంటూరు రాజ‌కీయం కొట్టిన పిండి! ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి వ్య‌తిరేకిగా కూడా ముద్ర ప‌డ్డారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న టీడీపీలోకి వెళ్ల‌డాన్ని అభిమానులు ఇష్ట‌ప‌డ‌డం లేదు.. తాజాగా భేటీ అయిన‌.. క‌న్నా అభిమానులు ఇదే విష‌యాన్ని తేల్చి చెబుతున్నారు. పార్టీ మారండి కానీ.. టీడీపీ వ‌ద్దు! అని తెగేసి చెబుతున్నారు.

దీనికి కార‌ణం.. క‌న్నా పోటీ చేయాల‌ని అనుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ క‌మ్మ వ‌ర్గం బ‌లంగా ఉంది. ఆ వ‌ర్గానికి, క‌న్నాకు ఏళ్ల త‌ర‌బ‌డి వైరం ఉంది. ఇప్పుడు వారిని కాద‌ని చంద్ర‌బాబు మొహ‌మాటానికి టికెట్ ఇచ్చినా.. క‌న్నా గెలుపు అనేది టీడీపీ క్షేత్ర‌స్తాయి నేత‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి వ‌చ్చిన 23 మందికి చంద్ర‌బాబు టికెట్లు ఇస్తే.. ఒకే ఒక్క‌రు విజ‌యం ద‌క్కించుకున్నారంటే.. టీడీపీ అనుకూలంగా లేద‌నే క‌దా అర్థం అని క‌న్నాఅభిమానులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌ష్ట‌మో.. న‌ష్ట‌మో.. జ‌న‌సేన‌వైపు వెళ్లాల‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన ను అభిమా నించే నాయ‌కులు..గుంటూరులో ఎక్కువ‌గా ఉన్నారు. క‌న్నా జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటే ఉభ‌య ప‌క్షాలూ కూడా ల‌బ్ది పొందుతాయి. పైగా గెలుపు సునాయాసం అవుతుంది. సో.. ఈ నేప‌థ్యంలోనే క‌న్నా అభిమానులు జ‌న‌సేన వైపు వెళ్లాల‌ని.. టీడీపీని అభిమానించి స‌రిపెట్టాల‌ని సూచిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో ఈ మేర‌కు వారు తీర్మానం చేశారు. మ‌రి క‌న్నా ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.