Begin typing your search above and press return to search.
ఏపీలో జరిగే హత్యల్లో సగానికి పైగా అదే కారణమట
By: Tupaki Desk | 26 Feb 2021 10:30 AM GMTఒక మనిషిని మరో మనిషి చంపే అనాగరికం ఈ నాగరిక ప్రపంచంలో ఎందుకు ఉంటుంది? అందునా డిజిటల్ ప్రపంచంలో మనిషిన చంపేంత కౌర్యం మనిషిలో ఎందుకు అంతలా పెరుగుతోంది? తరచూ చోటు చేసుకుంటున్న హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అన్న విషయాన్ని లెక్క తేల్చేందుకుఒక అధ్యయనం చేపట్టారు. ఏపీలో మూడేళ్ల వ్యవధిలో జరిగిన హత్య కేసుల వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంపై శోధన జరపగా.. కొత్తవిషయాలు బయటకు వచ్చాయి.
2017 నుంచి 2019 మధ్యన మూడేళ్ల కాలంలో ఏపీలో మొత్తంగా 2859 హత్యలు నమోదయ్యాయి. ఈ హత్యల్లో సగానికి పైనే వివాహేతర సంబంధాల కారణంగా చోటు చేసుకున్నవిగా తేలింది. తాజాగా జరిపిన పరిశోధన ప్రకారం మొత్తం హత్యల్లో 58.6 శాతం వివాదాలకు కారణాలు వివాహేతర సంబంధాలుగా తేల్చారు. అంతేకాదు.. ఈ హత్యల్లో బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే కావటం గమనార్హం.
వివాహేతర సంబంధాలు కారణంగా సగానికి పైనే హత్యలు చోటు చేసుకుంటుంటే.. ఆ తర్వాతి స్థానం కుటుంబ తగదాలు.. భూ వివాదాలు.. నగదు లావాదేవీల్లో తలెత్తిన గొడవలే హత్యలకు కారణమవుతాయని తేలింది. మూడేళ్లలో 1139 మంది హత్యకు కారణం ఆర్థిక లావాదేవీలు.. కుటుంబ కలహాలేనని తేలింది. ఈ హత్యల్లో అత్యధికులు కుటుంబ సభ్యులే కావటం గమనార్హం. మొత్తంగా చూసినప్పుడు హత్యలకు ప్రధాన కారణం రెండే అంశాలుగా తేల్చొచ్చు. ఒకటి అమ్మాయి.. రెండోది ఆర్థిక లావాదేవీలు. ఈ రెండింటి విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.