Begin typing your search above and press return to search.

అయ్యో అనిపించేలా ఆ క్రికెటర్ పోస్టు.. బూట్ల ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాడు

By:  Tupaki Desk   |   24 May 2021 8:30 AM GMT
అయ్యో అనిపించేలా ఆ క్రికెటర్ పోస్టు.. బూట్ల ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాడు
X
గల్లీ క్రికెటర్లు.. కాదంటే రంజీల వరకు వెళ్లిన క్రికెటర్లకు ఆర్థిక సమస్యలు అంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకానీ అంతర్జాతీయంగా దేశీయ జట్టుకు మూడు టెస్టు మ్యాచులు.. 18 వన్డేలు.. పాతిక టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? మన దేశంలో ఇలాంటి కెరీర్ ఉన్న క్రికెటర్ లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోతుంది. కానీ.. అన్ని దేశాల క్రికెట్ జట్టులోని వారికి అలాంటి పరిస్థితి ఉండదు. అందులోకి జింబాబ్వే లాంటి జట్టులోని వారికి ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావు.

జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్టు చాలామందిని విస్మయానికి గురి చేయటమే కాదు.. వారి దుస్థితికి అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. అంతర్జాతీయ అనుభవం ఉన్న ర్యాన్.. తన బూట్లు చెడిపోయాయని.. వాటికి బదులుగా కొత్త వాటి కోసం ఎవరైనా స్పాన్సర్లు ముందుకు వస్తారా? అని అడిగిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తన చెడిపోయిన బూట్ల ఫోటోను షేర్ చేసిన ర్యాన్.. ప్రతి సిరీస్కు ముందు తమ బూట్లను గమ్ తో అతికించుకోలేమని.. ఎవరైనా స్పాన్సర్ షిప్ ఇస్తారా అని తమ దారుణ పరిస్థితి గురించి తెలియజేస్తే.. అడిగేశాడు. దీంతో.. జింబాబ్వే క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇట్టే అర్థమైపోతుంది. వీరి దీన స్థితిని అర్థం చేసుకున్న ప్రముఖ పాద రక్షల సంస్థ ఫ్యూమా.. వీరికి స్పాన్సర్ షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో.. వీరికి బూట్ల కష్టాలు తీరనుందని చెప్పొచ్చు.