Begin typing your search above and press return to search.
ఢిల్లీ.. హైదరాబాద్ వాసుల ఫ్యూచర్ చూపిన 'థాయ్ లాండ్'
By: Tupaki Desk | 13 March 2023 2:00 PM GMTమాకు నచ్చింది చేస్తాం. మాకు తోచింది మాత్రమే పాటిస్తాం. నిబంధనల్ని పట్టించుకోం. ఎవరైనా ప్రశ్నిస్తే.. పరపతిని ఉపయోగించి నోళ్లు మూయిస్తాం. చేతిలో ఉన్న అధికారంతో ఏమైనా చేస్తామనే భావన మనకు ఎక్కువన్న సంగతి తెలిసిందే. బాధ్యతతో కంటే బాధ్యతారాహిత్యంతో వ్యవహరంచే వారే మన చుట్టూ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న దానికి నిదర్శనంగా మారింది థాయ్ లాండ్ వ్యవహారం.
అక్కడి గాలి నాణ్యత విషయాన్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. నిర్లక్ష్యం అంతకంతకూ పెరిగిపోయి.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే.. కేవలం వారం వ్యవధిలో 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరిన దుస్థితి. ఎందుకిలా? అంటే.. కొత్త వైరస్ కారణంగా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువుల విషయంలో నియంత్రణ సరిగా లేకపోవటం.. పంట వ్యర్థాల్ని తగలబెట్టే విషయంలో వెలువడే పొగతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు.
థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గాలిలో నాణ్యత తీవ్రంగా పడిపోవటంతో.. ఆ దేశ అధికారులు ఇప్పటికి కళ్లు తెరిచారు. పిల్లలు.. గర్భిణులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు.
వారిని బయటకు రావొద్దని కోరుగుతున్నారు. మూడు రోజుల్లో బ్యాంకాక్ లోని పలు ప్రాంతాల్లోని వాయు కాలుష్యం పెరిగిపోవటం.. సూక్ష్మ కణాలు మనిషి రక్తంలో కలిసిపోయి శరీర అవయువాల్ని దెబ్బ తీస్తున్న పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పూర్తిగా దాటిపోయిన పరిస్థితుల్లో.. పలువురు ఉద్యోగుల్ని ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్నారు.
ఒకవేళ బయటకు రావాల్సి వస్తే.. ఎన్95 మాస్కులు ధరించాలని చెబుతున్నారు. పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపకుండా ఉండేందుకు వీలుగా వారిని స్కూళ్లకు పంపొద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి. పార్కుల్లో నో డస్ట్ రూమ్ పేరుతో ఎయిర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేస్తున్నారు.
బ్యాంకాక్ అత్యధిక వాయు కాలుష్యంతో నిండిపోగా.. తర్వాతి స్థానంలో చియాండ్ మై నగరం ఉంది. ఇదంతా చూస్తే.. పరిసరాల్ని పట్టించుకోవటం తమకు తోచినట్లుగా వ్యవహరించే ఢిల్లీ.. హైదరాబాద్ లాంటి మహానగరాల వాసులకు ఇలాంటి ముప్పే భవిష్యత్తులో పొంచి ఉందన్న భావన కలుగక మానదు. అదే జరిగితే.. సామాన్య.. మధ్యతరగతి వారి పరిస్థితి ఎంత ఇబ్బందికకరంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సో.. బీకేర్ ఫుల్!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.