Begin typing your search above and press return to search.
చేతులు వెనక్కికట్టి.. గొంతులు కోసి చంపేశారు.. పాక్ లో ఉగ్రవాదుల దుశ్చర్య..!
By: Tupaki Desk | 4 Jan 2021 5:52 AM GMTపాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడ నివాసముంటున్న మైనార్టీ తెగలైన హజారాలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ఉగ్రమూక.. తాజాగా దాష్టికానికి పాల్పడ్డారు. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న హజారా తెగకు చెందిన కార్మికులను ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. చేతులు వెనక్కినెట్టి.. గొంతుకోసి చిత్రహింసలు పెట్టి హతమార్చారు. అనేక ఏళ్ల క్రితం హజారా తెగకు చెందిన కొందరు ఆఫ్టనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు వలస వచ్చారు.
వీళ్లంతా బలూచిస్థాన్ లో బొగ్గుగనుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఆదివారం ఉదయం కొందరు ఉగ్రవాదులు బలూచిస్థాన్ రాష్ట్రంలోని మూచ్ పట్టణంలోకి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న 11 మంది కార్మికులను కిడ్నాప్ చేశారు. వారిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. అనంతరం చేతులు వెనక్కి కట్టి గొంతులు కోసి దారుణం గా హతమార్చారు. ఈ విషయంపై హజారా ఉద్యమహక్కుల కార్యకర్త అలీ రజా మాట్లాడుతూ.. బలూచిస్థాన్ లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని ఆరోపించారు.
అయితే ఈ విషయంపై బలూచిస్థాన్ ప్రావిన్సుల హోం మంత్రి మిర్ జియుల్లాహ్ లాంగ్వ్ స్పందించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడిని వారిని వదిలిపెట్టబోమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. అయితే వందేళ్ల క్రితమే హజారా తెగకు చెందిన వాళ్లు ఆఫ్టనిస్థాన్ వచ్చి బలూచ్ ప్రాంతంలో స్థిరపడ్డారు.
వీరి జనాభా దాదాపు 2 లక్షలు ఉంటుంది. వీళ్లు పర్షియా భాషను మాట్లాడుతారు. వీళ్లకు మొదటినుంచి స్థానికులతో తగాదాలు ఉన్నాయి. అయితే తాజా ఘటనపట్ల హజరా తెగ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.