Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతల్లో మొదలైన టెన్షన్

By:  Tupaki Desk   |   3 March 2023 3:03 PM GMT
కాంగ్రెస్ నేతల్లో మొదలైన టెన్షన్
X
తెలంగాణ కాంగ్రెస్ ను పట్టాలెక్కించాలని ఊరు వాడా తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మరోవైపు ఆయన పాదయాత్ర రాకుండా కాంగ్రెస్ సీనియర్లు కుట్రలు చేస్తున్నారని రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే సీనియర్లకు భయపడి మాణిక్యం ఠాగూర్ వైదొలగగా థాక్రే కొత్త ఇన్ చార్జీగా వచ్చారు. అయితే ఆయన దూకుడు ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కు కారణం అవుతోంది.

ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్ రావు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, ములుగు, హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు.

అయితే ఆయన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ నివేదిక తయారు చేస్తున్నారు. ఈరిపోర్ట్ ను ఢిల్లీకి పంపిస్తున్నారు.

థాక్రే నియోజకవర్గాల్లో పర్యటన దెబ్బకు కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. థాక్రే ఢిల్లీకి పంపించే రిపోర్టులో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఉన్నాయంటూ గాంధీభవన్ లో హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. దీంతో ఆ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయోనని ఇన్ చార్జీలు, కీలక లీడర్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

అయితే థాక్రే మాత్రం రహస్యంగా వివిధ నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటి కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరం కనిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.