Begin typing your search above and press return to search.
కేసీఆర్ దత్తత గ్రామంలో రణరంగం
By: Tupaki Desk | 23 May 2016 5:59 AM GMTచిన ముల్కనూర్..కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఈ ఊరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం. గ్రామజ్యోతి కార్యక్రమం సందర్భంగా గత ఏడాది కేసీఆర్ ఈ ఊరిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ గ్రామంలో తాజాగా ఒక్కసారిగా రణరంగం చోటుచేసుకుంది. ఏకంగా ట్రైనీ కలెక్టర్ - ఆర్డీఓలను నిర్భందించారు. ఏం జరుగుతుందో తెలియక సామన్య జనం పరేషాన్ అయ్యే పరిస్థితి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు ఘర్షణ వాతవరణం ఏర్పడింది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిన ముల్కనూర్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని గ్రామసభలో గలాట జరిగింది. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గౌతంను - ఆర్డీవో చంద్రశేఖర్ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చారు. అయితే వారిని ఇండ్లు మంజూరు కానీ గ్రామస్థులు నిర్భందించారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు జిల్లా అధిష్టానానికి వాకబు చేశారు. చినముల్కనూర్ లో ఏంజరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి బృందాన్ని టీఆర్ ఎస్ నాయకులు - కార్యకర్తలు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
దీంతో బీజేపీ నేతలు - కార్యకర్తలు ఇది సరికాదని, ప్రజాస్వామ్యయుతంగా మేము పరిశీలనకు వచ్చామని చెప్పిన టీఆర్ ఎస్ నేతలు ససేమిరా అన్నారు. బీజేపీ గో బ్యాక్..ఏం ఒరగబెట్టాలనీ వచ్చారు వెళ్లిపోండీ అంటూ టీఆర్ ఎస్ నేతలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నేతలు - కార్యకర్తలు సైతం ప్రతిగా నినాదాలు చేశారు. తిరిగి టీఆర్ ఎస్ నేతలు మరో అడుగు ముందుకేసి నడుచుకుంటూ బస్టాండ్ వైపు వస్తున్న బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో తోపులాట జరిగింది. ఇరు వర్గాలు తోసుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్లారు. ఇటు బీజేపీ నేతలు అటు టీఆర్ ఎస్ నేతలు గ్రామంలోకి వెళ్లనివ్వమని భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎలా పోనీవ్వరు మీజాగీరు కాదంటూ బీజేపీ నేతలు బైఠాయించారు. దీంతో రెండు - మూడు గంటలు తీవ్ర ఉద్రిక్త - భయానక పరిస్థితిగా మారింది. తోపులాటలో ఇరు పార్టీల కార్యకర్తలు చొక్కాలు చిరిగాయి. చివరికి పోలీసు జోక్యంతో మూడు గంటల తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. పరిస్థితి కుదుటపడ్డాక బీజేపీ నేతలు గ్రామంలోకి వెళ్లి ఇండ్లు మంజూరైన, మంజూరు కానీ లబ్దిదారులతో మాట్లాడి వెనుదిగారు. మూడు గంటల పాటు గలాటా జరుగుతున్నా పోలీసులు ఆలస్యంగా ప్రేక్షకుల వలే వచ్చారనీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.