Begin typing your search above and press return to search.
అవినాష్ లో పెరిగిపోతున్న టెన్షన్
By: Tupaki Desk | 24 April 2023 1:28 PM GMTకడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ టెన్షన్ పెరిగిపోతోంది. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా అవినాష్ హైకోర్టులో ముందస్తుబెయిల్ తెచ్చుకున్నారు. ఇదే విషయాన్ని చాలెంజ్ చేస్తు వివేకా కూతురు డాక్టర్ సునీత సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్లో సునీతకు ఎలాంటి ఊరట దక్కలేదు కానీ ముందస్తు బెయిల్ రద్దు విషయాన్ని సోమవారం విచారిస్తామని సుప్రింకోర్టు చెప్పింది. హైకోర్టేమో అవినాష్ ను 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని ఆదేశించింది.
సుప్రింకోర్టేమో 24వ తేదీవరకు అరెస్టు చేయద్దన్నది. సో అవినాష్ బెయిల్ రద్దు, అరెస్టు వ్యవహారం ఈరోజు సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నాయి. హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదుకాబట్టి తనను సీబీఐ అరెస్టుచేయకుండా బెయిల్ ఇవ్వాలని అవినాష్ కోరుతున్నారు.
హత్యకేసులో తనను ఇరికించేందుకు సీబీఐ కుట్రలు చేస్తున్నట్లు మొత్తుకుంటున్నారు. ఇదే సమయంలో వివేకా హత్యలో ఎంపీదే కీలకపాత్రని సీబీఐ వాదిస్తోంది. అయితే తన వాదనకు తగ్గట్లుగా బలమైన ఆధారాలను మాత్రం చూపలేకపోతోంది.
ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సరే ఆ బెయిల్ గనుక సుప్రింకోర్టు విచారణలో రద్దయితే సీబీఐ అరెస్టు చేస్తుందేమో. ఎందుకంటే హైకోర్టు విచారణలోనే ఎంపీని అరెస్టుచేస్తారా అని సీబీఐని జడ్జి అడిగినపుడు అవసరం అయితే అరెస్టు చేస్తామని మాత్రమే చెప్పింది. అంటే అవినాష్ ను కచ్చితంగా అరెస్టుచేస్తామని మాత్రం చెప్పలేదు. కాకపోతే సీబీఐ వైఖరిని గమనిస్తే అరెస్టు చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.
తనను అరెస్టు చేయకుండానే ఎంపీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ సుప్రింకోర్టు గనుక ముందస్తు బెయిల్ రద్దుచేస్తే సీబీఐ అరెస్టుతో అవినాష్ రిమాండుకు వెళ్ళక తప్పేట్లు లేదు. ఇప్పటికే తన తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టుచేసి రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. కాబట్టి ఇపుడు అవినాష్ కూడా అరెస్టయితే ఒకే కేసులో తండ్రి, కొడుకులు అందులోను ఒక ఎంపీ అరెస్టవ్వటం సంచలనమవుతుందనే చెప్పాలి. మరి సుప్రింకోర్టు విచారణలో ఏమిజరుగుతుందో తెలీకే అవినాష్ లో టెన్షన్ పెరిగిపోతోంది.