Begin typing your search above and press return to search.
తెలుగుదేశం గ్రాఫ్ పెరగలేదా...?
By: Tupaki Desk | 2 July 2023 8:00 PM GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వస్తామని ఢంకా పధంగా చెబుతూ వతొసంది. అయితే తాజాగా వస్తున్న సర్వేలు చూస్తే తెలుగుదేశానికి పూర్తి నిరుత్సాహం కలిగించే విధంగా ఉన్నాయని అంటున్నారు. టైమ్స్ నౌ సర్వే తాజా సర్వేలో ఏపీలో టీడీపీకి ఒకే ఒక ఎంపీ వస్తుందని పేర్కొంది. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది.
టైమ్స్ నౌ సర్వేకు ఎంతో విలువ ఉందని అంటున్నారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఈ సర్వే ఇచ్చిన అంచనాలు నిజం అయ్యాయి. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా సర్వే ఫలితాలు కచ్చితంగానే ఇచ్చారు. రెండు నెలల క్రితం కూడా టైం నౌ ఒక సర్వే వెల్లడించింది. అందులో చూస్తే టీడీపీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇపుడు ఏకంగా ఒకటికి తగ్గించేసింది. ఈ రెండు నెలల్లో టీడీపీ గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోయిందా అన్న చర్చ అయితే వస్తోంది. మరో విషయం ఏమిటి అంటే టీడీపీ తరఫున విగరస్ గా ప్రచారం సాగుతోంది. లోకేష్ పాదయాత్ర అయితే అలుపు లేకుండా అయిదు నెలల పాటు సాగుతోంది.
దాంతో చూస్తూంటే కచ్చితంగా టీడీపీ గ్రాఫ్ పెరగాలి. కానీ అలా జరిగినట్లుగా ఎక్కడా సర్వేలో కనిపించడంలేదు. ఇక చంద్రబాబు కూడా జిల్లాల టూర్లు పెట్టుకున్నారు. బాబు సభలకు జనాలు విరగబడి వస్తున్నారు. మరి బాబుకు అంత ఆదరణ ఉంటే సర్వేలో అది ఎందుకు ప్రతిఫలించడంలేదు అన్నది ఒక డౌట్ గా ఉంది.
మరో వైపు చూస్తే ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో సైతం టీడీపీ వ్యూహాత్మకంగా ఒక సీటుని గెలుచుకుంది. దాంతో అప్పట్లో టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లుగా కనిపించింది. కానీ బలం అయితే సర్వేలో ఏ కోశానా కనిపించడంలేదు.
దీన్ని బట్టి చూస్తే టీడీపీ పై స్థాయిలో ఎంతలా కష్టపడుతున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం తగినంతగా ప్రచారం కానీ మద్దతు కానీ లేదని అంటున్నారు. ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్నా చాలా జిల్లాలలో తమ్ముళ్ళ మధ్య వర్గ పోరుతో పాటు అనేక మంది గడప దిగకపోవడం వల్లనే ఈ పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.
ఏది ఏమైనా కూడా సర్వే ఫలితాలను చూస్తే టీడీపీకి గెలుపు అన్నది ఇంకా ఆమడ దూరంలో ఉందనే అంటున్నారు. బాగా కష్టపడాల్సి ఉందని అంటున్నారు. మరి సర్వేలను పూర్తిగా కొట్టి పారేయడానికి లేదు. టీడీపీ తన గ్రాఫ్ పెంచుకోవడానికి చంద్రబాబు తానుగా తిరిగేస్తే సరిపోదు క్యాడర్ ని కూడా సమాయత్తం చేయాలన్నదే సర్వేల సారాంశం అని అంటున్నారు. చూడాలి మరి