Begin typing your search above and press return to search.

జేఈఈ అడ్వాన్స్డ్ - 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా!

By:  Tupaki Desk   |   18 Jun 2023 3:12 PM GMT
జేఈఈ అడ్వాన్స్డ్ - 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా!
X
నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్‌ 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షలో నాగర్‌ కర్నూల్‌ కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి 341/360 మార్కులతో జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలవగా.. అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ 298/360 మార్కులతో టాపర్‌ గా నిలిచింది. ఇదే సమయంలో తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం.

ఈసారి.. 1,80,372 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరవ్వగా... వారిలో 43,773 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 36,204 మంది అబ్బాయిలు.. 7,509 మంది అమ్మాయిలు ఉన్నారని అని ఐఐటీ గౌహతి వెల్లడించింది.

కాగా... ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు.

అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మంది విద్యార్థులను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

కామన్ ర్యాంక్ లిస్ట్ లోని టాప్ 10 ర్యాంకర్లు వీళ్లే..

వావిలాల చిద్విలాస్ రెడ్డి

రమేశ్ సూర్య తేజ

రిషి కార్ల

రాఘవ్ గోయల్

అడ్డగాడ వెంకట శివరాం

ప్రభవ్ ఖండేల్వాల్

బిక్కిన అభినవ్ చౌదరి

మలయ్ కేడియా

నాగిరెడ్డి బాలాజీ రెడ్డి

యక్కండి ఫని వెంకట మానేందర్ రెడ్డి

ఈసారి టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు హైదరాబాద్ జోన్ కు చెందిన వారే ఉండటం విశేషం. ఇక మిగిలినవారిలో నలుగురు ఢిల్లీ, రూర్కీకి చెందిన వారున్నారు!