Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాలు ఇరుకున పడ్డాయి

By:  Tupaki Desk   |   24 May 2023 10:00 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాలు ఇరుకున పడ్డాయి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కాక‌పోతే.. రెండు మూడు మాసాల ముందు తెలంగాణ‌లో .. కొంత ఆల‌స్యంగా ఏపీలో. అయితే..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సిట్టింగుల‌కు టికెట్లు ఇస్తామ‌న్న తెలంగాణ‌లోనూ.. గ్రాఫ్ బాగుంటేనే టికెట్లు ఇస్తా మ‌ని క‌రాఖండీగా చెప్పిన ఏపీలోనూ.. ప‌రిణామాల ప్ర‌క్రియ ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఇరు రాష్ట్రాల‌లోనూ స‌ర్వేలను బ‌ట్టి.. నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వ‌నున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది.

ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌జ‌ల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ప్ర‌జాభిమానం ఉన్న ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే టికె ట్ ద‌క్కుతుంద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకు వెళ్లాల‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ఐప్యాక్ టీంతో స‌ర్వేలు చేయించారు. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యేల పై న‌లుదిశ‌లా స‌ర్వేలు.. అభిప్రాయాలంటూ.. అనేక రూపాల్లో విచారించుకున్నాక‌.. ఇప్పుడు కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చే ప్ర‌య‌త్నాలు ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక‌, తెలంగాణ ప‌రిస్థితికి వ‌స్తే.. గతంలో సిటింగ్‌లకే టికెట్లు ఇస్తానన్న కేసీఆర్‌.. ఇప్పుడు ప్లేట్ మార్చారని తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్‌ సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇచ్చేది లేదని ఆయ‌న ఒక నిర్ణ‌యానికి వ‌చ్చినట్టు స‌మాచారం.

ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం లేనివారికి టికెట్‌ ఇచ్చి సీట్లు కోల్పోయే స్థితిలో తాము లేమని సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నార‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక ఇప్పుడు చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ముఖాల‌కు చోటు ఇస్తున్నార‌నే అధికారపార్టీల వ్యూహం వెనుక‌.. అసలు కార‌ణంపై చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త పేరుతో.. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించ‌డంలో ముఖ్య‌మంత్రులు వెనుక‌బ‌డుతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గ‌త రెండు సార్లుగా అధికారంలోకి బీఆర్ఎస్ విధానాల‌పైనా... అమలు చేయ‌ని వాగ్దానాల‌పైనా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతోఉన్నారు.

ఇక‌, ఏపీలో అలివి మీరిన అప్పులు.. రాజ‌ధాని లేకుండా చేయ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ వైఫ‌ల్యాలు వంటివి ఏపీలో పాల‌కుల‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేసింది. అయితే.. పాల‌కులు(ముఖ్య‌మంత్రులు) ఈ విష‌యాన్ని మ‌రుగున ప‌రిచి.. కేవ‌లం ఎమ్మెల్యేల‌దే త‌ప్పంటూ.. వారినే బూచిగా చూపించి.. టికెట్లు ఇవ్వ‌కుండా .. నిరాక‌రిస్తామ‌నే దిశ‌గా చ‌ర్య‌ల‌కు దిగ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.