Begin typing your search above and press return to search.

కొడుకుని కాపాడబోయి అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

By:  Tupaki Desk   |   5 Jun 2023 6:56 PM GMT
కొడుకుని కాపాడబోయి అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి
X
ఈ మధ్య కాలంలో విదేశాల్లో స్థిర పడిన భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తన కుమారుడి ని రక్షించబోయి తెలుగు వ్యక్తి ఒక వృశ్చివాత పడిన ఘటన అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమెరికా లోని కాలిఫోర్నియా బీచ్ కి ఇద్దరు పిల్లల కు తండ్రి అయిన జొన్నల గడ్డ శ్రీనివాస మూర్తి వెకేషన్ కు తీసుకువెళ్లాడు.

అయితే అక్కడ బీచ్ లో ఒక రాకాసి అల నుంచి పిల్లల ను తప్పించే క్రమంలో ఆయన మృత్యువాత పడ్డారు జొన్నలగడ్డ శ్రీనివాస మూర్తి కి ఈత రాజు అయినా సరే తన పిల్లల తో సహా ఆ బీచ్ కి వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వెళ్లారు. గత వారం శాంతాక్రస్ లోని పాంథర్ బీచ్ లో తన కుటుంబ సభ్యుల తో ఎంజాయ్ చేస్తున్న సమయం లో ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక ఆయన మృతదేహాన్ని భారతదేశాన్ని తరలించడం కోసం ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక పెద్ద రాకాసి అలా వచ్చి అతని కుమారుడిని లోపలికి లాక్ కోసం పోసాగింది.

చిన్నారి నీటిలో పడి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాడనే విషయం తెలుసుకుని శ్రీనివాస మూర్తి ఆయన్ని శ్రీనివాస్ మరొకరి సహాయంతో తన కొడుకును కాపాడుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆయన ఆ అలల్లో కొట్టుకుపోయారు.

ఆయన కు ఈత రాకపోవడంతో ఆయన మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి 911 సిబ్బంది చేరుకున్నారు. కానీ అప్పటికే శ్రీనివాస మూర్తి మృత్యువాత పడ్డారు. సీపీఆర్ చేసిన కూడా ఆయన్ని కాపాడుకో లేక పోయారు. వెంటనే కాలిఫోర్నియా లోని హైవే పెట్రోల్ హెలికాప్టర్లో ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు.

అయితే స్టాండ్ ఫోర్డ్ హాస్పిటల్ కు తరలించిన తర్వాత ఆయన మృత్యువాత పడినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఇక ఆయన అంత్యక్రియల కోసం ఫండింగ్ ఏర్పాటు చేయగా ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.