Begin typing your search above and press return to search.
ఇలాగైతే తమ్ముళ్ళకు కష్టమే సుమా... ?
By: Tupaki Desk | 16 Feb 2022 4:30 PM GMTఎన్నికలు అంటే టికెట్లు, ఆ మీదట పదవులు, అధికారాలు, రాజభోగాలు. ఇదే మన ప్రజాస్వామ్యం అయిదేళ్లకు ఒకసారి అందించే కానుక. 2019 ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తే దక్కినవి అచ్చంగా 23 మాత్రమే.
పొత్తులు లేకుండా బాబు హయాంలో ఫస్ట్ టైమ్ ఎలెక్షన్స్ ని ఫేస్ చేశారు అలా. మరి టోటల్ గా ఏపీలో సీట్లకు పోటీ చేసినా కూడా చాలా మంది టికెట్లను ఆశించి భంగపడిన వారు ఉన్నారు.
ఒక లెక్కన తీసుకుంటే ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారు నలుగురు ఉంటే అందులో ఒకరికే ఇచ్చారు. అలా వందల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గెలుపు ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచే టికెట్ల కోసం పోటీ పెరిగిపతోంది. టోటల్ గా చూసుకుంటే ఏపీవ్యాప్తంగా కనీసం వేయి మంది దాకా అభ్యర్ధులు టికెట్ల కోసం ఈసారి పోటీ పడే సీన్ ఉంది.
మరి బాబు ఈ వత్తిడిని తట్టుకునేది ఎలా. ఎవరికి టికెట్ కాదన్నా ఇబ్బందే. అలాగే ఎన్నికల వేళకు మారే అనేక సమీకరణలతో బలమైన వారిని గుర్తించాలి. దాంతో బాబు కొత్త రూటు ఎంచుకుంటున్నారుట.
ఈసారి ఎన్నికల్లో బాబు పెట్టే కండిషన్లు తమ్ముళ్ళకు తల బొప్పి కట్టించేలా ఉంటాయని అంటున్నారు. ఒక నియోజకవర్గంలో రెండు సార్లు ఓడిన వారిని ఈసారి కచ్చితంగా పక్కన పెట్టేస్తారుట. అదే విధంగా పార్టీ ఇంచార్జి పదవిలో ఉంటూ కూడా యాక్టివ్ గా లేని వారికి ఈసారి టికెట్లు దక్కవని చెప్పేస్తారు అంటున్నారు.
ఇక ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా కొందరు ఈ రోజుకీ నియోజకవర్గంలో పెద్దగా తిరగడంలేదు. అలాంటి వారు 23 మందిలో కూడా కొందరు ఉన్నారుట. వారికి కూడా టికెట్లు లేవు అని చెబుతున్నారు. ఇక వరసబెట్టి రెండు మూడుసార్లు గెలిచిన వారిని కూడా పక్కన పెట్టి కొత్తవారికి చాన్స్ ఇస్తారని చెబుతున్నారు.
మరో వైపు ఈసారి టికెట్ల ఎంపిక బాబుకు కష్టతరంగా మారుతుంది అంటున్నారు. ఆఖరు నిముషంలో బీజేపీ జనసేనలతో పొత్తు ఖాయమనే చెబుతున్నారు. దాంతో యాభై సీట్ల వరకూ పొత్తుల పేరిట త్యాగం చేయాలి.
దాంతో 125 సీట్లతోనే సర్దుకోవాలి. అంటే ఒక్కో సీటుకూ సగటున పది మంది దాకా పోటీదారులు ఉంటారు. మరి దీన్ని ఎలా అధిగమిస్తారో బాబు చూడాలి. ఏది ఏమైనా రెండేళ్ల ముందు నుంచే అన్ని లెక్కలను జాగ్రత్తగా వేసుకుంటూ బాబు టికెట్ల పంపిణీ విషయమో సకల జాగ్రత్తలూ తీసుకోవడానికి భారీ కసరత్తే చేస్తున్నారుట.