Begin typing your search above and press return to search.

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు షాక్‌: మాజీ ఎమ్మెల్యే రాజీనామా

By:  Tupaki Desk   |   4 Jun 2020 11:08 AM GMT
సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు షాక్‌: మాజీ ఎమ్మెల్యే రాజీనామా
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లాలో పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌నే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మ‌నోహ‌ర్‌. వాస్త‌వంగా బుధ‌వారం త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై పార్టీ వీడ‌డంపై చ‌ర్చించారు. ఇక గురువారం మీడియా ముఖంగా పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాన‌ని.. ఆ త‌ర్వాత ఏ పార్టీలో చేరాల‌నే విష‌యం చెబుతాన‌ని తెలిపారు.

1994 నుంచి మ‌నోహ‌ర్ టీడీపీలో ఉంటున్నారు. పార్టీలో అనేక పదవులు పొందారు. చిత్తూరు పట్టణ టీడీపీ కన్వీనర్‌గా పని చేశారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంత‌రం 1995లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ ఓట‌మి చెంఆరు. చివ‌ర‌కు 2004 ఎన్నికల్లో ఆయ‌న చిత్తూరు నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అనంత‌రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడం తో పార్టీకి దూరమ‌య్యారు.

అనంత‌రం 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం లో చేరి చిత్తూరు నుంచి మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి మనోహర్ టీడీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఆయన అక‌స్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయ‌డం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌హానాడు జ‌రిగి కొన్ని రోజులు కూడా కాలేదు.. అప్పుడే పార్టీకి ఊహించ‌ని దెబ్బ తగిలింది. ఆయ‌న ఎందుకు రాజీనామా చేశారోన‌నే విష‌యం మాత్రం చెప్ప‌లేదు.