Begin typing your search above and press return to search.

పంచాంగం చెప్పిందే జరిగింది కేసీఆర్

By:  Tupaki Desk   |   29 July 2016 4:51 AM GMT
పంచాంగం చెప్పిందే జరిగింది కేసీఆర్
X
మంత్రాలకు చింతకాయలు రాలవని చాలామంది చెబుతుంటారు. నమ్మే వాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నమ్మరు. అలాంటిది పంచాంగ శ్రవణం. నిజానికి చాలామంది నాస్తికవాదులు పంచాంగ శ్రవణాన్ని.. జ్యోతిష్యాన్ని తప్పు పడతారు. వాటిల్లోశాస్త్రీయత లేదని వాదిస్తారు. ఇటీవల జరిపిన ఒక సర్వేలో దేశంలోని 130 కోట్ల మందిలో నాస్తికవాదులు కేవలం వేలల్లోనే ఉన్నారని తేల్చింది. అదేం దరిద్రమో.. వేలల్లో ఉన్న గొంతుల్ని కోట్లాదిమంది మాటగా మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంది. ఇక.. ఆ విషయాన్ని అలా వదిలేస్తే.. పంచాంగ శ్రవణం ఒక ఫార్సుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదని.. పంచాంగ శ్రవణం రోజున ఏ మాటలైతే పంచాంగ కర్త నోటి నుంచి వచ్చాయో అలాంటివే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవాన్ని పలువురు గుర్తు తెచ్చుకోవటం కనిపిస్తోంది.

ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో పంచాంగపఠనకర్త జరగబోయే అంశాల్ని చెప్పుకొచ్చా. మంచిచెడుల గురించి మాట్లాడిన ఆయన.. దుర్ముఖి నామ సంవత్సరంలో విద్యా వైద్య రంగాల్లో అవినీతి పెరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. పంచాంగ శ్రవణంలో చెప్పిన విషయాల్ని ఉటంకిస్తూ.. విద్యా.. వైద్య ఆరోగ్య శాఖామంత్రులు జాగ్రత్తగా ఉండాలంటూ సరదాగా హెచ్చరించారు కూడా.

ఆ సరదా సన్నివేశం అలా ముగిస్తే.. తాజాగా ఎంసెట్ 2 పేపర్ లీక్ కావటం.. తెలంగాణప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన ఈ అంశం గురించి మాట్లాడుకునే క్రమంలో పంచాంగ శ్రవణం రోజు మాటల్ని పలువురు గుర్తు తెచ్చుకోవటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. ఎంసెట్ 2 లీకేజీ అంశం విద్యా.. వైద్య శాఖలకు సంబంధించి కావటంతో పంచాంగ శ్రవణ కర్త సంతోష్ కుమార్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా జరగటం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరికొందరు ఉత్సాహవంతులైతే.. నాడు పంచాంగ కర్త ఇంకేం విషయాల్ని చెప్పారన్న అంశంపై కూడా దృష్టి సారించటం గమనార్హం. మరీ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి.