Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైంది
By: Tupaki Desk | 19 Aug 2015 2:14 PM GMTతెలంగాణలో ఉద్యోగ జాతర స్టార్ట్ అయ్యింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తొలి ఉద్యోగ ప్రకటన వెలువడింది. బుధవారం టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 3, 783 అసిస్టెంట్ ఎగ్జిగ్యూటీవ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను వెలువరించారు. అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వారాల గడువు ఇచ్చారు. వచ్చే నెల 21వతేదీన నాలుగు జిల్లా కేంద్రాల్లో ఆన్ లైన్ లో పరీక్ష ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో కేంద్రాలుంటాయి. నోటిఫికేషన్ వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.
ఈ పరీక్షల తర్వాత గ్రూప్ పరీక్షలకు తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నెలాఖర్లో గ్రూప్ పరీక్షల సిలబస్‌ను ఖరారు చేయనున్నారు. తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనలు వెలువడడంతో సంతోషం వ్యక్తమవుతోంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుండడంతో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు అర్థమవుతోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టైం టేబుల్ / ఇతర వివరాలు
- అసిస్టెంట్ ఎగ్జిగ్యూటీవ్ ఇంజనీరింగ్ పరీక్ష తేదీ - సెప్టెంబర్ 20
- ఆగస్టు చివర్లో గ్రూప్ పరీక్షల సిలబస్ ఖరారు
- అక్టోబర్ లాస్ట్ వీక్ గ్రూప్ 2 నోటిఫికేషన్
- డిసెంబర్ గ్రూప్ 2 నియామకాలు
- గ్రూప్ 1లో ఉన్న 53 ఖాళీలకు న్యాయపరమైన చిక్కులు అధిగమించి త్వరలోనే నోటిఫికేషన్
- గ్రూప్ 1కు డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్
- గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ తప్పనిసరి
- కమల్ నాథన్ కమిషన్ తర్వాత మరిన్ని కొత్త ఖాళీలకు నోటిఫికేషన్