Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ టీడీపీ మూడు రోజులకు నిద్ర లేచింది

By:  Tupaki Desk   |   3 Feb 2022 11:30 PM GMT
తెలంగాణ‌ టీడీపీ మూడు రోజులకు నిద్ర లేచింది
X
తెలుగుదేశం పార్టీ `జాతీయ పార్టీ` అని ఆ పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు నుంచి మొద‌లుకొని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఎవ‌రు మాట్లాడినా ప్ర‌క‌టిస్తూ ఉండే సంగ‌తి తెలిసిందే. జాతీయ పార్టీ అంటే ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌కారం ఉన్న నిబంధ‌న‌లు ఏంటి? ఆయా నిబంధ‌న‌లు పాటిస్తూ టీడీపీ జాతీయ పార్టీ గుర్తింపు పొందిందా? అంటే స‌మాధానం అంద‌రికీ తెలుసు. అయిన‌ప్పటికీ, టీడీపీ నేత‌లు త‌మది జాతీయ పార్టీ అని చెప్తూనే ఉంటారు. అయితే, ఒకప్పుడు వెలుగు వెలిగిన తెలంగాణ‌లోనే ఆ పార్టీ కార్య‌క్ర‌మాలకు ఇపుడు ఆదరణ కరవైంది. ఇందుకు తాజా ఘ‌ట‌నే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం పెట్టిన అనంత‌రం నుంచే త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తున్నాయి. బీజేపీ లాంటి పార్టీలైతే ఏకంగా గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చాయి కూడా. రాజ్యాంగాన్ని మార్చాల‌న్న డిమాండ్ కీల‌క‌మైన‌ది కాబ‌ట్టి ఇలాంటి నిర‌స‌న‌లు వెలువ‌డ‌తుఉన్న త‌రుణంలో ప్ర‌ధాన పార్టీ అని చెప్పుకొనే `జాతీయ పార్టీ` తెలంగాణ శాఖ ఏ విధంగా ఉండాలి? అంటే మ‌న‌కు స‌మాధానం కూడా తెలిసిందే.

కేసీఆర్ కీల‌క కామెంట్లు చేసిన త‌ర్వాత మూడు రోజుల‌కు తాపీగా తెలంగాణ టీడీపీ స్పందించింది. భార‌త రాజ్యాంగం మార్పు చేయాల‌ని సీఎం కేసీఆర్ చేసిన వాఖ్య‌లు డాక్ట‌ర్ బీ.ఆర్ అంబెద్క‌ర్ ను కించ‌ప‌రిచే విదంగా ఉన్న‌ద‌ని ఆ వాఖ్య‌లు వెన‌క్కి తీసుకొని దేశ ప్ర‌జ‌ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో గురువారం తెలంగాణ టీడీపీ నాయ‌కులు ప‌త్రికా స‌మావేశం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ కు జ్జానోద‌యం క‌లిగించాల‌ని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబెద్క‌ర్ విగ్ర‌హానికి టీడీపీ నాయ‌కుల బృందం మెమోర‌డం అందించింది. మొత్తంగా ఈ కార్య‌క్ర‌మాల ద్వారా తాము సైతం తెలంగాణ‌లో ఉన్నామ‌నే సిగ్న‌ల్ టీటీడీపీ ఇచ్చింది.!