Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు షాకిచ్చిన ఆర్టీసీ సంఘాలు
By: Tupaki Desk | 4 Jun 2018 4:26 PM GMT టీఆర్ ఎస్ లో కేసీఆర్ ను అందరూ భోళాశంకరుడిగా పోలుస్తుంటారు. శరణు అంటూ వచ్చిన వారికి అన్నం పెట్టి వారికి అండగా ఉంటారని పేరుంది. అలా కాకుండా డిమాండ్ల సాధనకు పోరుబాట పడితే అణిచివేస్తాడని కూడా పేరుంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీది రెండో దారిలాగే కనిపిస్తోంది.
నిజానికి కేసీఆర్ గద్దెనెక్కాక నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నారు. ప్రభుత్వ నిధులు ఇచ్చి గట్టెక్కించారు. సొంతగా నడిచేలా నానారకాల ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వమే పలు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇచ్చింది. అంతేకాదు.. ఆర్టీసి సిబ్బంది, ఉద్యోగులకు 45శాతం ఫిట్ మెంట్ కూడా ఇచ్చి వారి జీతాలు పెరగడానికి కారణమయ్యారు. ఇది జరిగి రెండేళ్లు కాకుండా మళ్లీ జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ డ్రైవర్లు - కండెక్టర్లు డిమాండ్ చేయడంపై కేసీఆర్ ఆగ్రహించారు. ఇటీవలే వారు కలుస్తామన్న కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. సవ్యంగా సాగుతున్న ఆర్టీసీని కొందరు నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని సమ్మె చేస్తే కార్మికులే నష్టపోతారని కేసీఆర్ హెచ్చరించారు. అయినా పట్టు వీడని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సైరన్ మోగించడం తెలంగాణలో సంచలనమైంది.
జూన్ 11 నుంచి తెలంగాణ ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆర్టీసీ సంఘాలు కేంద్ర కమిటీలో ఏకగ్రీవంగా నిర్ణయించాయి. జూన్ 7 నుంచి సమ్మె సన్నాహక సమావేశాలుంటాయని.. వేతన సవరణ చేయనందుకు నిరసనగా ఆర్టీసీ సంఘాలు రోజుకో నిరసన తెలుపుతాయన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే జూన్ 11నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించాయి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై గుర్రుగా ఉన్న కేసీఆర్ వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడనే ఆసక్తిగా మారింది.