Begin typing your search above and press return to search.
దేశంలోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది తెలంగాణలో.?
By: Tupaki Desk | 3 Feb 2022 4:49 PM GMTతెలంగాణలో నిరుద్యోగులు, వారికి ఉద్యోగాల కోసం ఉద్యమ సమయంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటికీ చేయడం లేదని ఓ వైపు ఉద్యమాలు సాగుతుంటే.. మరోవైపు దేశంలోనే అత్యంత నిరుద్యోగ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం అందరినీ ముక్కున వేలేసేకునేలా చేసింది. ఇండిపెండెంట్ థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ జనవరి 2022 సర్వే ప్రకారం.. భారతీయ రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటును చూపే జాబితాను విడుదల చేసింది.
సీఎంఐఈ ప్రకారం, ఒమిక్రాన్ కేసుల క్షీణత తర్వాత ఆంక్షల సడలింపుతో దేశం క్రమంగా కోలుకోవడంతో భారతదేశ నిరుద్యోగిత రేటు జనవరిలో 6.57 శాతానికి పడిపోయింది. ఇది మార్చి 2021 నుండి కనిష్ట స్థాయి కావడం ఆందోళన కలిగిస్తోంది..
హర్యానాలో అత్యధిక నిరుద్యోగిత రేటు 23.4% గా ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ (18.9%) మరియు త్రిపుర (17.1%) తర్వాతి స్థానాల్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నాయి.
ఈ ఏడాది జనవరిలో తెలంగాణలో అత్యల్ప నిరుద్యోగిత రేటు 0.7%గా నమోదైంది. ఆ తర్వాత గుజరాత్ (1.2%), మేఘాలయ (1.5%), ఒడిశా (1.8%) ఉన్నాయి.
ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగిత రేటు 6.2%గా నమోదు కావడం గమనార్హం. .