Begin typing your search above and press return to search.
కర్ణాటక ఎన్నికల్లోకి తెలంగాణ పార్టీ
By: Tupaki Desk | 5 April 2023 1:00 PM GMTఎంఐఎం.. హైదరాబాద్ లో పుట్టిన ఈ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్,యూపీ , గుజరాత్ సహా ముస్లిం జనాభా ఎక్కడ అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో పోటీచేస్తూ గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకపై కన్నేసింది. అక్కడ బరిలోకి సన్నాహాలు చేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అక్కడ ఎన్నికల సందడి మొదలైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి మరో పార్టీ సిద్ధమైపోయింది. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ కర్ణాటకలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 25 చోట్ల పార్టీ అభ్యర్థులను దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
కర్ణాటక కు చెందిన ఎంఐఎం పార్టీ సీనియర్ నేత ఒస్మాన్ ఘని మంగళవారం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ బలంగా ఉన్న 25 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని ఘని మీడియాకు తెలిపారు.
జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని.. ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరిపామని ఘని వివరించారు. అయితే జేడీఎస్ తో పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదని.. వేచిచూస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
జేడీఎస్ తో పొత్తు ఉన్నా లేకున్నా కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని.. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను మా పార్టీ ప్రకటించిందని ఘని వివరించారు.
ఇక ఎంఐఎం పార్టీ పోటీతో కాంగ్రెస్ కే నష్టమని భావిస్తున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం కలుగుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో ముస్లింలకు కేటాయించిన 4శాతం రిజర్వేషన్ ను బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఎందుకు ఆందోళన చేయలేదని.. ఎందుకు మౌనంగా ఉండిపోయారని ఎంఐఎం పార్టీ నాయకులు ప్రశ్నించారు.
2018లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం పార్టీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అయితే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.