Begin typing your search above and press return to search.
తెలంగాణలో కొత్త ట్రెండ్.. ఆ లైసెన్స్ ఫ్రీగా ఇస్తున్న పార్టీలు
By: Tupaki Desk | 9 July 2023 10:07 AM GMTమరో నాలుగు నెలల్లో వచ్చేస్తున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణలోని రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడకు తెర తీశాయి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నాయి. పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ఇందుకోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి.. అక్కడి బ్రోకర్లకు డబ్బులు చెల్లించి.. క్యూ వరసలో నిలబడి.. ఇలా ప్రాసెస్ కాస్త ఎక్కువే. అందుకే.. ఆ బాధ్యతను తెలంగాణలోని రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి.
యువ ఓటర్లకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సులను ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. దీని కోసం ఆయా పార్టీల నేతలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. యూత్ కు గాలం వేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లి.. తొలుత నిర్ణీత ఫీజు చెల్లించి.. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా.. పార్టీలు ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు వెళ్లి.. వివరాలు ఇస్తే చాలు.. వారే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు.
ఈ విధానాన్ని మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో అధికార బీఆర్ఎస్ నేతలు షురూ చేయగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోనూ అమలు చేశారు. అనంతరం దుబ్బాక ఏర్పాటు చేశారు. తాజాగా మెదక్.. సంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ తరహా కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి.
తొలుత ఈ కొత్త విధానాన్ని అధికార బీఆర్ఎస్ మొదలు పెట్టినా.. తాజాగా దీన్నిబీజేపీ సైతం అందిపుచ్చుకుంది. దుబ్బాకలో బీజేపీ ఈ తరహా కౌంటర్ ఓపెన్ చేయగా.. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ నేతలు సైతం కౌంటర్ ఓపెన్ చేయటం గమనార్హం. ఈ కౌంటర్లకు యువ ఓవర్లు ఎక్కువగా వస్తున్నారు. వారికి అవసరమైన డ్రైవింగ్ లైసెన్సు ను తమ ద్వారా ఇవ్వటం ద్వారా వారి మనసుల్ని దోచుకోవచ్చన్నది పార్టీల భావన. తాజాగా దుబ్బాకలో ఏర్పాటు చేసిన పార్టీల కౌంటర్ల ద్వారా వేలాది మంది యూత్ డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అసలే ఎన్నికల సీజన్ కావటం.. పలు నియోజకవర్గాల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను మిగిలిన వారు అందిపుచ్చుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తక్కువ ఖర్చుతో మనసును దోచుకునే ఛాన్సును రాజకీయ పార్టీలు ఎందుకు విడిచి పెడతాయి చెప్పండి?