Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ కవిత ఫోన్లు ఏమయ్యాయి? ఈడీ ఏం చేస్తోంది?
By: Tupaki Desk | 26 March 2023 10:00 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటివరకు మూడుసార్లు విచారణ జరపటం తెలిసిందే. ఈ మూడు దఫాల్లో మొత్తం 27 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ప్రతి అంశాన్ని నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడేం జరగనుంది? ఈడీ స్వాధీనం చేసుకున్న కవిత ఫోన్ మాటేంటి? మళ్లీ నోటీసులు ఇచ్చారా? విచారణ ఉంటుందా? ఒకవేళ నోటీసులు పంపితే కవిత స్పందన ఏమిటి? లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మూడోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన అనంతరం.. తిరిగి వచ్చే సమయంలో మరోసారి విచారణకుహాజరు కావాల్సి ఉంటే.. ఈ మొయిల్ ద్వారా సమాచారం అందిస్తామని.. ఆ సమయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. విచారణ ఉంటుందా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రావటం లేదు. మళ్లీ విచారణ ఉంటే ఈ మొయిల్ ద్వారా సమాచారం అందిస్తామన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
విచారణ నేపథ్యంలో కవిత నుంచి సేకరించిన వివరాలతో పాటు.. తాము స్వాధీనం చేసుకున్న ఫోన్ లోని డేటాను విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ చేతికి వచ్చిన తర్వాత మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇస్తారని చెబుతున్నారు.
ఈడీ నుంచి మరోసారి విచారణకు నోటీసులు వస్తే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు ఈ నెల 27నసుప్రీంలో కవిత దాఖలు పిటిషన్ విచారణకు రానుంది. ఈ సందర్భంగా సుప్రీంఎదుట ఏమేం మాట్లాడాలన్న దానిపై న్యాయనిపుణులతో కేసీఆర్ అండ్ కో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
రాజకీయంగా బీజేపీని.. న్యాయపరంగా ఈడీని ఎదుర్కోవటం ఎలా అన్న దానిపై ప్లానింగ్ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్ తో పాటు.. మంత్రులు కేటీఆర్.. హరీష్ లు సైతం సమాచాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాం మొత్తం రాజకీయంగా తమను దెబ్బ తీసేందుకేనని బీఆర్ఎస్ భావిస్తోంది. కీలక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళలో.. మొదలైన ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.