Begin typing your search above and press return to search.
కర్ణాటకలో తెలంగాణ నేతలు.. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం
By: Tupaki Desk | 20 April 2023 10:00 AM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో 20 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కూడా కొందరు నాయకులు బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నాయి. వీరిలో కీలక నేతలతోపాటు..ఫైర్ బ్రాండ్స్ కూడా ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ తరఫున
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్కు చోటు కల్పించింది. వీరితో పాటు మరో 40 మందిని కూడా నియమించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ప్రచారం చేస్తారు. అదేవిధంగా రణదీప్ సింగ్ సుర్జేవాలా, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, చిదంబరంలు కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నిస్తారు.
బీజేపీ తరఫున..
బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను తెలంగాణ నుంచి కర్ణాటకలో స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను కూడా నియమించారు. అదేవిధంగా మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నాయకులను ఎంపిక చేశారు. అందులో 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా రాష్ట్ర నేతలను నియమించారు.
నియోజక వర్గాల ఇంచార్జ్‌లు..
తెలంగాణకు చెందిన లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ వెళ్లి ప్రచార పర్వంలో పాల్గొనాలి. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించారు.