Begin typing your search above and press return to search.
న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు సీరియస్..
By: Tupaki Desk | 31 Dec 2020 9:15 AM GMTన్యూఇయర్ వస్తుంటే ఆ హడావుడే వేరు. కరోనా కాలం కావటంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగర పరిధిలోని హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ పోలీసు కమిషనర్లు న్యూఇయర్ పార్టీలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేయటం తెలిసిందే. అయితే.. కొన్ని మీడియా కథనాల్లో మాత్రం న్యూఇయర్ ను పురస్కరించుకొని పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు.. మామూలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంటూ.. గుట్టుచప్పడు కాకుండా ఈవెంట్లను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ కథనాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. సుమోటోగా తీసుకున్న కోర్టు.. నూతన సంవత్సర వేడుకల్ని ఎందుకు బ్యాన్ చేయలేదని ప్రశ్నించింది. ఓవైపు కొత్త వైరస్ ప్రమాదకరమని ఆరోగ్య శాఖ డైరెక్టర్ చెబుతుంటే.. మరోవైపు వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
విచ్చలవిడిగా బార్లు తెరిచి ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్.. మహారాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకల్ని బ్యాన్ చేశారని హైకోర్టు గుర్తు చేసింది. పలు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. వేడుకలు జరపుకోవద్దని ప్రజలకు సూచన చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. డిసెంబరు 31 సందర్భంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించిన నివేదికను జనవరి ఏడున తమకు సమర్పించాలని పేర్కొంది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో.. కేసీఆర్ సర్కారు మేల్కొని వేడుకలకు.. బార్లకు చెక్ పెట్టనుందా? అన్నది చూడాలి.