Begin typing your search above and press return to search.
'తాయత్తుతోనే బతికాను'.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
By: Tupaki Desk | 18 April 2023 2:00 PM GMTఆయన తెలంగాణకు హెల్త్ డైరెక్టర్. జనాలకు వైద్యంపై అవగాహన కల్పించి వారిని రోగాల పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ వైద్యం కంటే ఈ తాయత్తులు పవర్ ఫుల్ అని.. వాటివల్లనే బతికానంటూ మూఢనమ్మకాలు వ్యాపించేలా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతావా? అంటూ నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉండి ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించాల్సిన ఈ ఉన్నతాధికారి అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక ఇఫ్తార్ విందులో పాల్గొని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 'చిన్నతనంలో తాను తనకు కట్టిన తాయత్తు వల్లే బతికి ఉన్నానని.. ఆ తావీజ్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని' షాకింగ్ కామెంట్స్ చేశారు. డాక్టర్లు చేయలేని పనిని తాయత్తు చేసిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపైన కూడా వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, కొత్తగూడెం ప్రజలుఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీచేస్తానని వెల్లడించాడు. గతంలోనూ ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాట్ టాపిక్ గా మారారు.
అప్పట్లో 'కరోనా ఏసుక్రీస్తు దయవల్లే తగ్గిందంటూ' వ్యాఖ్యానించారు. మూఢ నమ్మకాలు ప్రోత్సహించే విధంగా డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివసరావు చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
గతంలో కేసీఆర్ తనకు తండ్రితో సమానం అంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు శ్రీనివాసరావు. ఒక ఉన్నతాధికారి ఇలా చేయడం వివాదాస్పదమైంది. తాజాగా తాయత్తు వల్లనే తాను బతికానని అన్న మాటపై సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు. ఈయన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా సూట్ కారని.. ఒక బాబా గా మారాలంటూ పలువురు కామెంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.