Begin typing your search above and press return to search.
హరీష్..మరీ ఇంత ఓవరాక్షనా ?
By: Tupaki Desk | 12 April 2023 11:21 AM GMTఏపీ గురించి తక్కువచేసి మాట్లాడటం తెలంగాణా మంత్రులకు బాగా అలవాటైపోయింది. తెలంగాణా మంత్రుల గురించి లేదా తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా అభివృద్ధిగురించి ఏపీ మంత్రులు ఏమీ మాట్లాడకపోయినా తెలంగాణా మంత్రులు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
తాజాగా హరీష్ రావు ఇలాంటి ఓవరయాక్షనే చేశారు. సిద్ధిపేటలో జరిగిన మేస్త్రీ సంఘం భవన నిర్మాణం సందర్భంగా మాట్లాడుతు తెలంగాణా స్ధిరపడిన ఏపీ కూలీలు తమ ఓట్లను తెలంగాణాలో నమోదుచేయించుకోవాలని చెప్పారు.
ఏపీనుండి పనులకోసం తెలంగాణాకు వచ్చిన కూలీలకు ఏపీలో పరిస్ధితులు, తెలంగాణాలో పరిస్ధితులు బాగా తెలుసన్నారు. ఏపీ అభివృద్ధికి తెలంగాణా అభివృద్ధికి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత గ్యాప్ ఉందట. ఏపీలో పాలన ఎలాగుందో చూడండి తెలంగాణా పాలన ఎలాగుందో చూసుకోండన్నారు. కాబట్టి ఏపీలో ఓటుహక్కును వదులుకుని తెలంగాణాలో నమోదుచేసుకోవాలని కోరారు. రోడ్లు, దవాఖానాల్లో తెలంగాణాతో పోల్చుకుంటే ఏపీ ఎందుకు పనికిరాదన్నట్లుగా మాట్లాడారు.
ఆ సందర్భంగా ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశారంటే తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే. విచిత్రం ఏమిటంటే హరీష్ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి మాత్రమేనేమో. హైదరాబాద్ సిటీలో డ్రైనేజీ, రోడ్ల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరు చూస్తున్నదే.
అలాగే హైదరాబాద్ వదిలేస్తే మిగిలిన రాష్ట్రం అభివృద్ధి ఏమిటో హరీష్ చెప్పాలి. జిల్లా, గ్రామాల్లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అందరూ చూస్తున్నదే. ఇక దవాఖానాల అభివృద్ధిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది. హైదరాబాద్ ను మైనస్ చేసేస్తే అప్పుడు తెలుస్తుంది తెలంగాణా అభివృద్ధి ఏమిటో.
ఏపీ జనాల ఓట్లు కావాలంటే అడగాల్సిన పద్దతి ఇదికాదు. చెప్పాలంటే కేసీయార్ పాలనలో ఎన్నో మైనస్ లున్నాయి. కాకపోతే అవన్నీ మాట్లాడితే రాష్ట్రాల మధ్య గొడవలవుతాయి. అందుకనే ఏపీలో ఎవరు తెలంగాణా గురించి మాట్లాడటంలేదు. మరి ఇదే ఇంగితం తెలంగాణా మంత్రుల్లో కనబడటంలేదు. ఏపీ జనాల ఓట్లు కావాలని అనుకున్నప్పుడు తెలంగాణా గొప్పదనాన్ని చెప్పుకుంటే తప్పులేదు. అంతేకానీ ఏపీని కించపరచి ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరంలేదు.