Begin typing your search above and press return to search.

మహేష్ బ్యాంక్ వ్యవహారంలో హైకోర్టు మెట్లు ఎక్కిన తెలంగాణ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   29 Dec 2020 9:35 AM GMT
మహేష్ బ్యాంక్ వ్యవహారంలో హైకోర్టు మెట్లు ఎక్కిన తెలంగాణ ప్రభుత్వం!
X
ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాంక్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికలను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు మెట్లు ఎక్కింది. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్, ఓటర్ల నమోదు నుండి నిర్వహణ వరకు అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం ,బ్యాంకు లావాదేవీల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని కోరింది. ఏపీ మహేష్ కో -ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఇటీవల ఉద్రిక్తత వాతావరణంలో జరిగాయి. అందులో 32 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిచుకున్నారు.

ఈ క్రమంలో బోగస్ ఓట్లు వేస్తున్నారని మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ జంగ్ వర్గంపై, భగవతి దేవి ఆరోపణలు చేశారు. దీంతో పోలింగ్ బూత్ ‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించింది. ఎన్నికల కౌంటింగ్ జరిపి ఫలితాన్ని షీల్డ్ కవర్‌ లో రాష్ట్ర హైకోర్టుకు సమర్పించారు. సామాన్య మధ్య తరగతి ప్రజలకు సంబందించిన డబ్బు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోర్టుకు విన్నవించుకుంది రాష్ట్ర సర్కార్. అక్రమంగా గోల్డ్ లోన్ లు ఇచ్చి వారిని ఓటర్లుగా మార్చి ఎన్నికల్లో గెలవాలని ప్రస్తుత చైర్మన్ రమేష్ బంగ్ అక్రమాలకు పాల్పడ్డాడని పిటిషన్ లో పేర్కొంది.

ఏపీ మహేష్ బ్యాంక్ ను కాపాడటం కోసం అడ్మినిస్ట్రేటివ్ ను నియమించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. అలాగే ప్రస్తుత బ్యాంక్ ఎలాంటి పాలసీ డెసిషన్ తీసుకోవద్దని ప్రభుత్వం పేర్కొంది. బ్యాంక్ లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీఐ ద్వారా మహేష్ బ్యాంక్ పై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరింది.