Begin typing your search above and press return to search.
మరఠ్వాడ వేదికగా కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఏం చెప్పనున్నారు?
By: Tupaki Desk | 5 Feb 2023 12:00 PM GMTజాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ను విస్తృతం చేస్తున్నారు. ముందుగా తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో గులాబీ జెండా రెపరెపలాడించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీలో కమిటీ వేసిన కేసీఆర్ తాజాగా మహారాష్ట్రలోనూ పార్టీ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఆదివారం నాందేడ్ లో నిర్వహించే సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరితో మహారాష్ట్ర కమిటీ వేసే అవకాశం ఉంది. ఆ తరువాత కేసీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ‘జై తెలంగాణ’ నినాదం వినిపించిన కేసీఆర్ ఇప్పుడు ‘జై భారత్’ అని అంటున్నారు. కానీ నాందేడ్ సభలో ‘ జై మహారాష్ట్ర’ అని నినదిస్తారన్న చర్చ సాగుతోంది.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత తొలి సభను ఖమ్మంలో నిర్వహించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాందేడ్ లో రెండో సభ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తొలి రాష్ట్రాయేతర సభ ఇదే మొదటిది కావడం విశేషం. ఏపీ, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి పలువురు నేతలు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్రకు చెందిన నేతలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. అయితే నాందేడ్ లో నిర్వహించే సభలో వారు గులాబీ కండువా కప్పుకోనున్నారు. నాందేడ్ లో సభ నిర్వహించడం ద్వారా అటు మహారాష్ట్ర, ఇటు ఉత్తర తెలంగాణలో ప్రభావితం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
నాందేడ్ సభ నిర్వహణ బాధ్యతను ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజాబాద్ నేతలకు అప్పగించారు. నాందేడ్ తో సంబంధాలున్న వారు అక్కడి సభకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ జిల్లాల నేతలు స్థానిక ప్రజలను నాందేడ్ సభకు తీసుకెళ్లనున్నారు. అలాగే నాందేడ్ లో ఉన్న తెలుగువారిని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం కేసీఆర్ ‘జై తెలంగాణ’ నినాదం ఎంచుకున్నారు. బీఆర్ఎస్ గా మారిన తరువాత ‘జై భారత్ ’ అని అంటున్నారు. అయితే నాందేడ్ సభలో కేసీఆర్ ‘జై మహారాష్ట్ర’ అని నినదించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక నేతలను ఆకట్టుకోవడానికే ఈ నినాదాన్ని వాడుతారని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా మరాఠీలు మద్దతు ఇస్తేనే అధికారంలోకి వస్తాయి. అందువల్ల వారిని ఆకట్టుకోవడానికి కేసీఆర్ ‘జై మహారాష్ట్ర’ అని అంటారని తెలుస్తోంది. ఇక మరాఠా పీపుల్స్ కోసం ప్రత్యేక హామీలు కూడా ఇస్తారన్న చర్చ బీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.