Begin typing your search above and press return to search.
బండి మొదలెట్టేశారు.. 20 మంది గులాబీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట
By: Tupaki Desk | 15 Jun 2023 9:40 AM GMTబండి మార్క్ మాటలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోతుందన్న మాటలు బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ వాదన తప్పన్న విషయాన్ని చాటి చెప్పేందుకు వీలుగా టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నాల్ని మళ్లీ షురూ చేశారు. ఇటీవల కాలంలో కాస్తంత కామ్ గా ఉన్న ఆయన..తాజాగా ఇటీవల కాలంలో తాను మాట్లాడని లోటును తీర్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమతో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు. బండి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావటానికి రోజు ముందు.. మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో భేటీ కావటం.. ఆ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారని.. మీతో ఎవరైనా ఉంటే.. టచ్ లోకి వెళ్లమని చెప్పటం తెలిసిందే.
పార్టీ మారాలనుకునే వారికి ఇదే సరైన సమయమన్న కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చేలా రిటార్టు ఇచ్చేలా బండి తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ''బీజేపీలోకి రావటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నాడు. కాంగ్రెస్ కు స్పాన్సర్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ కానుందన్న ఆయన.. ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ''జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే వచ్చాయి'' అని గుర్తు చేశారు.
బండి సంజయ్ హిందువులు గురించి బరాబర్ మట్లాడుతాడన్న ఆయన.. బీజేపీ వల్లే కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు భాగ్యలక్ష్మీ దేవాలయం బాట పట్టారన్నారు. ''కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీ వలనే సైతం భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఔట్ అయింది. మోదీ తొమ్మిదేళ్ళ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే బీజేపీ కార్యాలయాలు'' అని పేర్కొన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్న బండి..కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా.. అవినీతికి పాల్పడిన వారు జైలు వెళ్లటం ఖాయమన్నారు. ''అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవినీతిపరులను జైలుకు పంపటం లేదని ప్రజలు, మీడియా పదే పదే అడుగుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. అవినీతిపరులు జైలుకు పోవటం ఖాయం'' అని వ్యాఖ్యానించారు.
ధరణితో పేద ప్రజలు నాశనం అవుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 'ధరణి పేదల పాలిట శాపం. ధరణి పోర్టల్ కి, రైతుబంధుకు సంబంధం ఏంటో కేసీఆర్ చెప్పాలి'' అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. పేద పిల్లను చదివించే బాధ్యతను బీజేపీ తీసుకుంటోందని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నప్పుడు వారిలో ఒక్కరైనా ఎప్పుడు బయటకు వస్తారు? అన్న ప్రశ్నకు బండి బదులు ఇవ్వగలరా?