Begin typing your search above and press return to search.

'ముద్దు' వ్యాఖ్యలపై బండి సంజయ్ కు కమిషన్ కారణం చెప్పాలట

By:  Tupaki Desk   |   15 March 2023 1:21 PM GMT
ముద్దు వ్యాఖ్యలపై బండి సంజయ్ కు కమిషన్ కారణం చెప్పాలట
X
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ‘ముద్దు’ వ్యాఖ్యలతో నోరుపారేసుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన అహాన్ని వీడడం లేదన్న చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎంపీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న బండి దూకుడు తగ్గించడం లేదు. ఇటీవల మహిళా కమిషన్ కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై బండి స్పందించాడు. రాష్ట్ర మహిళా కమిషన్ కు లేఖ రాశాడు. ఈనెల 18న హాజరు అవుతానని వెల్లడించాడు.

విచారణకు హాజరు కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తాను కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని.. దానికి సంబంధించిన వివరాలు ఇస్తే తాను వివరణ ఇచ్చేందుకు సులువు అవుతుందని కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈనెల 15న హాజరు కాలేనని.. 18వ తేదీన హాజరు అవుతానని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిషన్ కు లేఖ రాశారు.తాను ఎందుకు రావాలో కమిషన్ తనకు వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

తాను విచారణకు రావడానికి ముందే ఆ వివరాలుఇస్తే కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు సులభం అవుతుందని బండి సంజయ్ వివరించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఢిల్లీలో ఉన్నానని.. ఈనెల 15న కమిషన్ ముందు విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. ఆరోజు కమిషన్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చి వివరణ ఇస్తానని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ కమిషన్ సోమవారం బండికి నోటీసులు జారీ చేసింది. దీనిపైనే బండి సంజయ్ వివరణ ఇస్తున్నాడు.