Begin typing your search above and press return to search.
కేసీఆర్‌పై కోపం.. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా.. జనం నమ్ముతారా?
By: Tupaki Desk | 11 Feb 2023 8:00 AM GMTరాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనే. అయితే.. ప్రజలకు సంబంధించిన ఆస్తుల విషయంలో నాయకులు ఎవరైనా కూడా ఆచితూచి మాట్లాడాలి. ప్రభుత్వం ఏదైనా.. ప్రజల సొమ్ముతో చేసిన నిర్మాణాలపై అన్ని పార్టీల నాయకులు ఆచి తూచి అడుగులు వేయాలి. లెక్క చూసుకుని మాట్లాడి. ఎలా బడితే అలా మాట్లాడేస్తే.. ప్రజలు హర్షిస్తారా? స్వాగతిస్తారా? ఇదీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో జరుగుతున్న చర్చ. సీఎం కేసీఆర్‌పై ఉన్న కోపంతో రెండు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారాయి.
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సీఎం కేసీఆర్‌పై కోపం ఉండొచ్చు.. లేదా అధికార పార్టీపై అక్కసు ఉండొచ్చు. కానీ, ప్రగతి భవన్ చేసిన పాపం ఏంటి? అనేది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న. సో.. రేవంత్‌రెడ్డి ఏం చేసినా.. స్వాగతించిన నెటిజన్లు.. ఈ వ్యాఖ్యలను మాత్రం తప్పుబడుతున్నారు.
ఇక, బీజేపీ విషయం చూస్తే.. ఆపార్టీ రాష్ట్ర చీఫ్.. బండి సంజయ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఈయన నూతన సచివాలయ భవనాన్ని టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. సచివాలయాన్ని అక్బరుద్దీన్ ఒవైసీ తాజ్‌మహల్‌తో పోల్చారన్న సంజయ్.. ఆ వ్యాఖ్యలు విని సీఎం కేసీఆర్ ఆనందించారని విమర్శించారు.
‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లిలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి మాట్లాడారు. పాతబస్తీ వెనుకబాటుకు ప్రధాన కారణం.. ఎంఐఎం, బీఆర్ ఎస్ పార్టీలేనని ఆరోపించారు. ‘‘తొలుత సచివాలయ నిర్మాణం రూ.400 కోట్లు అంచనా అన్నారు. తర్వాత దాన్ని రూ.800 కోట్లు చేశారు. అనంతరం రూ.1200 కోట్లకు పెంచి.. కంప్యూటర్లు, తదితరాల కోసం రూ.300కోట్లు అని చెప్పారు.
మొత్తం సుమారు రూ.1700 కోట్లతో సచివాలయాన్ని తాజ్‌మహల్ మాదిరి నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉంది. రానున్న బీజేపీ ప్రభుత్వం(వచ్చేదీ చచ్చేదీ ఇంకా తెలియదు).. సచివాలయ రూపురేఖలు మొత్తం మార్చేస్తుంది’’ అని సంజయ్ తెలిపారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు అటు కాంగ్రెస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు మురిసిపోవచ్చు.. చప్పట్లు కూడా కొట్టవచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలు మాత్రం హర్షించడం లేదు. ఇదే అభిప్రాయాన్ని నెటిజన్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా.. నాయకులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.