Begin typing your search above and press return to search.

`సీఎం టు సీఎం` ఏపీలో ఇదే టాక్ ఆఫ్ దిటౌన్‌

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:30 PM GMT
`సీఎం టు సీఎం` ఏపీలో ఇదే టాక్ ఆఫ్ దిటౌన్‌
X
రాజ‌కీయాల్లో వ్యూహాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. పార్టీలు అనుస‌రించే వ్యూహాలు, పార్టీ అధినేత‌లు వేసే వ్యూహాలు చాలా చాలా చిత్రంగా ఉంటాయి. అయితే, ఏ పార్టీకైనా.. ప్ర‌జ‌లే ముఖ్యం. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు పెద్ద పార్టీ నుంచి చిన్న పార్టీ వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లే చోద‌క శ‌క్తి. ఈ విష‌యంలో రెండో మాటే లేదు. అయినంత మాత్రాన.. నేత‌ల‌కు విలువ లేకుండా ఉండ‌దు. కొమ్ములు తిరిగిన పార్టీ అయినా.. కీల‌క నేత‌ల నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు కూడా ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే.. ఎంత ప్ర‌జ‌లు ఓట్లేసి గెలిపించాల‌న్నా కూడా పార్టీల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌లో వీరే ప్ర‌ధానంగా ప‌నిచేస్తారు క‌నుక‌.. నేత‌ల‌కు ఉండే వాల్యూ నేత‌లకు ఎప్పుడూ ఉంటుంది.

స‌మ‌ష్టి కృషితో..
కానీ, ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో మాత్రం చిత్ర‌మైన వ్యూహం ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లోనే కాకుండా.. సాధార‌ణ ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ అధినేత జ‌గ‌న్.. అంతా తానే అయి చ‌క్రం తిప్పుతున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు - పార్టీకి మ‌ధ్య తాను త‌ప్ప మ‌రెవ‌రుఅవ‌స‌రం లేద‌నే ధోర‌ణితో ముందుకు సాగుతున్న‌ట్టుగా ఆయ‌న ఒక వ్యూహం ప్ర‌కారం ముందుకు సాగుతున్నార‌ని వీరు భావిస్తున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ 151 సీట్ల‌తో క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది. అయితే, ఇదంతా పార్టీ ఫ్లేమ్ కావొచ్చు.. స్థానికంగా నేత‌లు చేసిన కృషి కావొచ్చు.. అదేస‌మ‌యంలో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన ఇమేజ్ కావొచ్చు.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వెనుక‌
అన్ని స‌మీక‌ర‌ణ‌లు స‌మ‌పాళ్ల‌లో కుదిరి.. పార్టీ ఘ‌న విజయం ద‌క్కించుకుంది. ఇది అంద‌రూ అనుకున్న‌.. అనుకుంటున్న మాట‌. కానీ, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మాత్రం.. ఇలా అనుకోవ‌డం లేదట‌! పార్టీ విజ‌యం వెనుక తాను మాత్ర‌మే ఉన్నాన‌ని, త‌న ఫొటోను చూసి.. త‌నపై న‌మ్మ‌కంతోనే 150(జ‌గ‌న్ మిన‌హా) మందిని గెలిపించార‌ని ఆయ‌న ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నార‌ట‌! ఈ క్ర‌మంలోనే ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టి .. నేరుగా ప్ర‌జ‌ల‌తోనే ఆయ‌న సంబంధాలు నెరుపుతున్నారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం వెనుక‌, దాదాపు 4 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల‌ను నియ‌మించ‌డం వెనుక జ‌గ‌న్ వ్యూహం ఇదేన‌ని ఇప్పుడు అర్ధ‌మ‌వుతోంద‌ని నాయ‌కులు గుస‌గుస‌లాడుతుంటే.. సాధార‌ణ ప్ర‌జ‌లు బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు.

అంతా తానే.. అన్నీ తానే!
ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప్ర‌తికార్య‌క్ర‌మాన్నీ .. వ‌లంటీర్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నారు. ప్ర‌జ‌లకు ఏ ఇబ్బంది వ‌చ్చినా.. వ‌లంటీర్ కు చెప్ప‌గానే స్పందించే వ్య‌వ‌స్థ‌ను పెట్టుకున్నారు. ప్ర‌తికార్య‌క్ర‌మానికీ.. ప్ర‌తి వ‌ర్గానికీ.. ఒక టోల్ ఫ్రీ నెంబ‌రును కేటాయించారు. అంటే.. మ‌ధ్య‌లో కీల‌క‌మైన ఎమ్మెల్యేల‌ను కానీ, ఇతర నేత‌ల‌ను కానీ.. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌పై సంప్ర‌దించే అవ‌కాశం లేకుండా ఈ వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తున్నారు. ఫ‌లితంగా నేత‌లు రేపు జంప్ చేసినా.. లేదా జ‌గ‌న్ కుదూర‌మైనా.. జ‌గ‌న్ తో విభేదించినా.. కూడా పార్టీ గెలుపుపై ప్ర‌బావం ప‌డ‌కుండా.. నేరుగా ప్ర‌జ‌లకు తాను క‌నెక్ట్ అయి.. వైసీపీ అంటే.. జ‌గ‌న్‌.. అనే స్థాయిలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే వ్యూహంలో భాగంగానే ఇలా చేశార‌నేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

త‌మిళ‌నాడులో ఏం జ‌రిగిందంటే..
అంటే.. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జ‌గ‌న్ ఎవ‌రికి టికెట్ ఇచ్చినా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను చూసి.. ఓట్లే స్తారే త‌ప్ప‌..వ్య‌క్తులు, నేత‌ల‌ను బ‌ట్టికాద‌నేది ఆయ‌న ప్ర‌ధాన వ్యూహంగా ఉంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? నిజంగానే నేత‌లు డ‌మ్మీలైతే.. రాజ‌కీయ వ్య‌వ‌స్థ నిల‌దొక్కుకుంటుందా? అనేది కాల‌మే నిర్ణ‌యించాలి. గ‌తంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా చేసిన జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి వంటివారు ఈ ప్ర‌యోగాలు చేశారు. ప్ర‌జ‌ల‌కు ఉచితాల పేరుతో అమ్మ‌.. అన్న .. అనే నినాదాల‌తో చేరువ‌య్యారు. గుళ్లు కూడా క‌ట్టించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి అప్పటి ప‌రిస్థితులు.. ప్ర‌జానాడిని అంచ‌నా వేయ‌డంలో త‌ల‌కిందులు అయిన ప‌రిస్థితి ఉంది. మ‌రి ఏపీలో ఏం జ‌రుగుతుందో చూడాలి.