Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా నిర్ణయంపై కేంద్రానికి సుప్రీంలో ఊరట..!
By: Tupaki Desk | 13 Feb 2023 8:00 PM GMTబీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు.. 370 ఆర్టికల్ రద్దు.. ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలకు కేంద్రంలోని మోదీ సర్కార్ చెక్ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి.. ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు సైతం ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ అంశాల్లో మోదీ సర్కార్ ముందుకే వెళ్లింది. అయితే వీటిపై పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇటీవల పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రాన్ని సమర్థిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం సోమవారం కొట్టివేసింది. దీంతో కేంద్రానికి భారీ ఊరట లభించినట్లయింది. ఈ పిటిషన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!
జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ.. ఐదు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే వీటిని డీలిమిటేషన్ కమిషన్ తిరగరాసింది. అయితే ఈ చర్య బీజేపీకి లాభం చేకూర్చేలా ఉందంటూ శ్రీనగర్ కు చెందిన హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్.. మహమ్మద్ అయూబ్ మట్టో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం విచారణకు స్వీకరించింది.
కిందటి ఏడాది మేలో జమ్మూ అసెంబ్లీకి 114 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తూ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. ఇందులో 24 పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కు.. 43 జమ్మూ రీజియన్ కు .. 47 కశ్మీర్ లోయకు సీట్లను కేటాయించింది. అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ శరణార్థులకు.. ఇద్దరు కశ్మీర్ వలస వాదులను సైతం అసెంబ్లీకి నామినేట్ చేయాలని డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు చేసింది.
1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని దేశంలో 2026 వరకు నియోజకవర్గాలను పునర్వర్థీకరించడానికి వీల్లేదని.. కేంద్ర పాలిత ప్రాంతాలను విభజించిన తర్వాత నియోజకవర్గాలు ఎలా మారుస్తారని సుప్రీంలో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వాదించారు.
అయితే కేంద్రం కశ్మీర్ ప్రత్యేక హోదాను.. జమ్మూ కశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం 2019 ప్రకారమే నియోజకవర్గాల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వాదించింది. ఈ వాదనతో సుప్రీం ఏకీభవించింది. దీంతో ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. కాగా ఈ ఏడాదిలో కుదరకుంటే వచ్చే ఏడాదిలో జమ్మూ కశ్మీర్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.