Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి అయ్య‌న్నపై కేసు విచార‌ణ‌.. సుప్రీం కోర్టు షాకింగ్ ఆదేశాలు!

By:  Tupaki Desk   |   27 Feb 2023 7:02 PM GMT
మాజీ మంత్రి అయ్య‌న్నపై కేసు విచార‌ణ‌.. సుప్రీం కోర్టు షాకింగ్ ఆదేశాలు!
X
మాజీ మంత్రి, టీడీపీ కీల‌క నాయ‌కుడు చింత‌కాయ‌ల అయ్య‌న్నాపాత్రుడుకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌నపై ఏపీలో న‌మోదైన‌ ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతినిచ్చింది. అయ్యన్నపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో అయ్యన్నపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతినిస్తూ జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్జరీ సెక్షన్ల ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. దీంతో అయ్య‌న్న‌పైకేసు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

ఏమిటీ కేసు?

బిల్డింగ్‌ ప్లాను విషయంలో న‌ర్సిప‌ట్నం మునిసిప‌ల్ అధికారుల‌ సంతకాలు ఫోర్జరీ చేశార‌ని అధికారులు కేసు న‌మోదు చేశారు. అయితే, దీనిపై అయ్య‌న్న హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఫోర్జరీ చేసి... ఎన్ఓసీ తీసుకున్నారని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారి పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది.

సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. తన ఇల్లు నిర్మించే క్రమంలో నీటిపారుదల శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారని అయ్యన్నపాత్రుడుపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు విష‌యంలో హైకోర్టు స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.