Begin typing your search above and press return to search.

వినాయకా... సన్నీలియోన్ పాటలా?

By:  Tupaki Desk   |   23 July 2015 10:57 PM GMT
వినాయకా... సన్నీలియోన్ పాటలా?
X
ఏమాటకామాట చెప్పుకోవాలంటే... దేవుడి పేరున జరిగే ఉత్సవాల్లో, ఊరేగింపులో అసభ్యకరమైన పాటలు, నృత్యాలు, అల్లర్లు ఈమధ్య కాలంలో చాలా సాదారణం అయిపోయాyi! అవి లేకపోతే ఆ ఉత్సవాలకు అందం లేదు అనే స్థాయిలో ఆపనులు చేసేవారి వాదన ఉంటుంది! ఇది దేవుడికి ఇష్టమా, భక్తులకు ఇష్టమా, ప్రజలకు అవసరమా అంటే... సమాధానం చెప్పడానికి సంశయించేవారే ఎక్కువ!!

అయితే తాజాగా ఇటువంటి పనులు చేస్తున్నవారిపై కోర్టును ఆశ్రయించారు ఒక డాక్టర్! ముంబై శీవారు ప్రాంతాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఇతరపండుగలు వేడుకులుగా జరుపుకునే సందర్భంగా ఏర్పాటు చేసేచోట అసభ్యకరమైన పాటలు వేస్తూ జనాలకు ఇబ్బందిని కలిగిస్తున్నారని మహేష్ బెడెకర్ అనే వైద్యుడు హైకోర్టులో పిల్ వేశారు. ఈయనకు థానే ప్రాంతంలో ఒక హాస్పటల్ ఊడా ఉంది. అయితే ఆ హాస్పటల్ లో ఉన్న రోజులు ఇబ్బంది పడేస్థాయిలో, ముసలివాళ్లకు గుండెదడ వచ్చేస్థాయిలో, అసభ్యకరమైన పదాలతో కూడిన ఐటం సాంగ్స్ ని వేస్తూ హోరెత్తిస్తున్నారని ఆరోపించారు!

ఇలా చెప్పడం వల్ల ఒక మతానికి, ఉత్సవానికి తాను వ్యతిరేఖం అని భావించవద్దని రిక్వస్ట్ చేశాడు! ఈ ఉత్సవాలను రాజకీయనాయకులు రాజకీయం చేస్తున్నారని, సన్నీలియోన్ నటించిన సినిమాలోని "మున్నీ బద్నాం హూయి..." వంటిపాటలు కూడా వేసి డాన్సులు చేస్తున్నరూ... దేవుడికి ఇవి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు! ఇదే సమయంలో తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబందం లేదని నొక్కి వక్కానిస్తున్నారు. అయితే ఈ పిల్ పై త్వరలో కోర్టు తన తీర్పును వెల్లడించనుంది!