Begin typing your search above and press return to search.
వివేకా హత్య: అవినాష్ కు షాకిచ్చిన సునీత!
By: Tupaki Desk | 10 March 2023 2:01 PM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణ తెలంగాణకు మారాక సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించింది. అలాగే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి తదితరులను కూడా కడప జైలు నుంచి హైదరాబాద్ కు పిలిపించుకుని విచారించింది.
వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 5 రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. మార్చి 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ముచ్చటగా మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24 అవినాష్ సీబీఐ విచారణకు హైదరాబాద్ లో హాజరైన సంగతి తెలిసిందే.
మరోవైపు విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ మార్చి 9న తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఎవరో చెప్పినట్టు విచారణ చేస్తోందని.. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని.. తననే నేరస్తుడనని నిరూపించేలా సీబీఐ విచారణ సాగుతోందని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో పలు అభ్యంతరాలను లేవనెత్తారు.
అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి చెక్ పవర్ ను ఆయన కుటుంబ సభ్యులు రద్దు చేశారని, ఆయనకు రెండో వివాహమైందని.. కుమారుడు కూడా ఉన్నారని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆస్తి అంతా రెండో భార్య కుమారుడు పేరు రాస్తారని భావించిన సునీత, ఆమె భర్తే వివేకాను హత్య చేసి ఉండొచ్చని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వివేకా కుమార్తె సునీత.. చంద్రబాబు, బీటెక్ రవి ప్రభావాలను లోనై తనపైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆమె ఇంప్లీడ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.
మరోవైపు వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మార్చి 10న మధ్యాహ్నం వాదనలు ప్రారంభమయ్యాయి. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన సీబీఐ విచారణకు వెళ్లారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇంతకు ముందు విచారణల్లో రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ఆయన లాయర్ కోర్టుకు తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24వ తారీఖున చేసిన విచారణ స్టేట్‌మెంట్లపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్‌మెంట్స్ ను పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది విన్నవించారు. రెండుసార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయలేదన్నారు. రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి నుంచి సీబీఐ సంతకాలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. 40 నుంచి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారని చెప్పారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్‌మెంట్లు మార్చి ఉండొచ్చన్నారు.
సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు పూర్తిగా అవినాష్ సహకరిస్తున్నారన్నారు. మార్చి 10న హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. దీంతో ఆయన తాజాగా విచారణకు హాజరయ్యారన్నారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. అవినాష్ ను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. సీబీఐ విచారణ కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇప్పటి వరకు సహకరించామని.. ఇక ముందు కూడా సహకరిస్తామని అవినాష్ రెడ్డి తరుపు లాయర్ కోర్టుకు హామీ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.