Begin typing your search above and press return to search.

అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదు.. వివేకా కుమార్తె ఏంచెప్పారంటే?

By:  Tupaki Desk   |   1 Jun 2023 10:00 AM GMT
అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదు.. వివేకా కుమార్తె ఏంచెప్పారంటే?
X
మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ముందస్తు బెయిల్ అంశం పై అవినాశ్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 'అవినాశ్ తల్లికి గుండె కవాటాలు మూసుకుపోయియి. దానికి సంబంధించిన శస్త్ర చికిత్స జరుగుతోంది' అని పేర్కొన్నారు.

దీంతో కోర్టు ఆయన కు అరెస్టు చేయొద్దంటూ మే 27న మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం తెలిసిందే. అయితే.. అవినాశ్ తరఫు లాయర్ వాదనలు వినిపించినట్లుగా.. ఎంపీ తల్లికి సర్జరీ జరగలేదని పేర్కొంటూ డాక్టర్ సునీత తాజాగా మెమోను సమర్పించారు.

అవినాశ్ తల్లికి సర్జరీ చేస్తున్నారంటూ కోర్టు కు చెప్పిన విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే.. చర్యలు తప్పవని అప్పట్లో కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకానం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తనకు తెలిసినట్లుగా డాక్టర్ సునీతా పేర్కొన్నారు. సర్జరీ జరుగుతోందన్న లాయర్ ప్రకటన తప్పు అని.. దాన్నినిర్దారించటానికి రికార్డులు లేనందున గతంలో ఇచ్చిన ఆదేశాల పై అవినాశ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ సునీత తరఫు న్యాయవాది తాజాగా కోర్టు ను కోరారు.

దీనికి సంబంధించి న్యాయమూర్తి స్పందిస్తూ.. సంబంధిత రికార్డులు సమర్పించారు కదా? అన్న ప్రశ్న వేయగా.. సునీత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సర్జరీ జరిగిందన్న రికార్డులు లేవని పేర్కొన్నారు. తమ మెమో ను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సునీత తరపు న్యాయవాది వినతిని అంగీకరిస్తూ న్యాయమూర్తి మెమో ను తీసుకున్నారు.

దీంతో.. ఇప్పుడు అవినాశ్ తల్లికి సర్జరీ జరిగిందన్న విషయాన్ని నిరూపిస్తూ.. రికార్డుల్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంపీ అవినాశ్ తరఫు లాయర్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.