Begin typing your search above and press return to search.
ఏంటీ ఫ్లెక్సీల రగడ.. రియాక్ట్ కాని సునీత..!
By: Tupaki Desk | 27 April 2023 10:00 AM GMTవైసీపీ అధినేత, సీఎం జగన్ కు సోదరి అయ్యే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చుట్టూ ఇప్పుడు ఫ్లెక్సీ ల రగడ కొనసాగుతోంది. ఆమె టీడీపీలోకి చేరిపోయారంటూ.. పసుపు జెండాలు.. ఫ్లెక్సీలు.. కడప జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో దర్శనమిచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ.. ఇంకా ఫ్లెక్సీలు కొనసాగుతున్నాయి. వీటి విషయంలో అటు సునీత కానీ.. ఇటు వైసీపీ కానీ రియాక్ట్ కాలేదు.
ప్రస్తుతం తన తండ్రి వివేకానందరెడ్డి దారుణ హత్య పై సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టుల్లో కేసు లు వేస్తున్నారు. అదేసమయంలో సీఎం జగన్ పైనా ఆమె విమర్శలు చేస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే.. కాదన్నారంటూ.. కొన్నాళ్ల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే.. సునీత ఏకంగా.. వైసీపీ కి చెందిన కీలక నాయకులపై ఆరోపణలు చేయడం.. తనకు కూడా బంధువే అయిన.. ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కోసం పోరాటం చేయడం తెలిసిందే.
వాస్తవానికి వివేకా కేసులో సునీత గట్టిగా పట్టుబట్టరని.. తేలిపోతుందని వైసీపీ నాయకులు.. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా భావించారు. కానీ, అనూహ్యంగా ఆమె పట్టువదలని విక్రమార్కిణి మాదిరిగా .. న్యాయ పోరాటం చేస్తున్నారు.
అయితే.. సునీత పోరాటాన్ని పలుసందర్భాల్లో .. టీడీపీ నాయకులు ప్రశంసిస్తు న్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయకుడు కూడా పదే పదే సునీత తెగువ చూపించారని పట్టుదలతో పోరాడుతున్నారని అన్నారు.
ఇక, నారా లోకేష్ కూడా.. సునీతను పలు సందర్భాల్లో ప్రశంసించారు. ఇదిలావుంటే.. అనూహ్యంగా పులి వెందుల, పొద్దుటూరు, కడప నియోజకవర్గాల్లో సునీత ఫొటోలతో కూడిన పచ్చ ఫ్లెక్సీలు దర్శన మిచ్చాయి . దీనివెనుక బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా.. పసుపు వర్ణంతో ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. సునీత న్యాయ పోరాటంలో టీడీపీ సహకరిస్తోందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఈ కేసులో తమకు సంబంధం లేనప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా చర్చ ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా.. సునీత నుంచి కానీ, టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. మరో వైపు పార్టీ కీలక నాయకుడు బీటెక్ రవి మాత్రం ఖండించారు. సునీత కు తమ పార్టీకి సంబంధం లేదన్నారు. మరి మున్మందు ఏం జరుగుతుందో చూడాలి.