Begin typing your search above and press return to search.
పవన్ సీఎం అంటూ హీరో సుమన్ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 23 March 2023 8:09 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అంటే అవుతారు అని అభిమానులు బల్లగుద్దుతారు. ఇక జనసేనాని అయితే సీఎం అని అరవడం కాదు ముందు నాకు ఓట్లు వేయండి అందరూ ఓట్లేసేలా చూడండి అని హితవు పలుకుతారు. పవన్ అన్న గారు అయిన మెగాస్టార్ చిరంజీవి అయితే ఏదో నాటికి పవన్ సీఎం అవుతారు అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. పవన్ శ్రేయోభిలాషులు అయితే ఆయన లాంటి వారు సీఎం అయి తీరాలి అని అంటారు.
మొత్తం మీద చూసుకుంటే పవన్ సీఎం అని డ్యాం స్యూర్ గా ఎవరూ చెప్పకపోయినా పవన్ సీఎం అన్న రెండు మాటలను కలుపుతూ తమకు తోచిన విధంగా మాట్లాడుతారు. ఇక వెటరన్ హీరో అయిన సుమన్ అయితే ఉగాది వేళ తన అభిమానులతో గడిపారు. తెలుగు సంవత్సరాది క్యాలండర్ ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని అన్నారు. ఆయనకు ఉన్నంతమంది ఫ్యాన్ మెయిల్ వేరే ఏ హీరోకూ లేదని అన్నారు అది పవన్ అదృష్టం అని కూడా అనవచ్చు అన్నారు. అయితే రాజకీయాలు వేరు అని అన్నారు. అక్కడ చాలా సమీకరణలు ఉంటాయని అన్నారు.
వాటిని అన్నింటినీ బేరీజు వేసుకోవాలని అన్నారు. అలాగే అనేక అంశాలు రాజకీయాల్లో ప్రభావితం చేస్తాయని అన్నారు. ఇక సీఎం కావాలని రాసిపెట్టి ఉంటే కనుక తప్పకుండా పవన్ సీఎం ఏదో నాటికి అవుతారు అని సుమన్ అన్నారు. ఆ విషయం కాలానికే వదిలేయాలని అన్నారు. ఆ దేవుడిని తాను నమ్ముతాను అని ఆయన చెబుతూ ఆయన ప్రతీ మనిషిని ఏదో ఒక పని చేయడానికి ఈ భూమి మీదకు పంపిస్తారని, అలా సీఎం గా పనిచేయమని పవన్ని ఆయనే ప్రేరేపించినపుడు కచ్చితంగా పవన్ సీఎం అయి తీరుతారు అని అన్నారు.
ఈ సందర్భంగా సుమన్ కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఒడిషా సీం నవీన్ పట్నాయక్ ఇప్పటికి అయిదు సార్లు సీఎం గా ఉన్నారని ఆయన అంత సుదీర్ఘకాలం సీఎం గా ఉంటారని ఎవరైనా అనుకున్నారా అని అడిగారు. ఆయనకు దేవుడు ప్రజలకు సేవ చేయమని అలా ఆదేశించారని, ఆ దీవెనలు ఉన్నంతవరకూ ఆయన ఆ పదవిలో ఉంటారని అన్నారు. అదే విధంగా లక్ కూడా రాజకీయాల్లో ఉన్న వారికి కలసి రావాలని అన్నారు.
కేవలం రాజకీయాలు మాత్రమే కాదు వ్యాపారం చేసిన వారికి కూడా అదృష్టం ఉండాలని తాను నమ్ముతాను అని సుమన్ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సినీరంగానికి సంబంధించిన వ్యక్తి అని ఆయనకు అంతా మంచి జరగాలనే తాను కోరుకుంటాను అని ఆయన అన్నారు. అదే విధంగా పవన్ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రాజకీయాల్లో రాణించాలని సుమన్ కోరారు. మొత్తానికి ఈ సీనియర్ హీరో చెప్పేది ఏంటి అంటే రాసి పెట్టి ఉంటే పవనే ఏపీకి సీఎం అని. అలా దేవుడు పవన్ నుదిటి మీద రాశారా లేదా అన్నది కాలమే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.