Begin typing your search above and press return to search.
దాయాది దేశంలో హిందూ మహిళ సంచలనం
By: Tupaki Desk | 30 Jan 2019 1:30 AM GMTపేరుకు దాయాదే కానీ.. విడిపోయిన నాటి నుంచి కుళ్లును..కుతంత్రాన్ని మనసంతా నింపుకొని నిత్యం మన మీద ఏడిచే పాకిస్థాన్ లో అన్ని వర్గాల వారికి ఉండే స్వేచ్ఛ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముస్లింలకు తప్పించి.. మిగిలిన వర్గాలకు హక్కులు.. వారిని అత్యున్నత స్థానాల్లో నియమించే సంస్కృతి అస్సలు ఉండదు.
అర్హత ఉన్నా కానీ వారిని ఎదగనీయకుండా చేయటం.. అయినప్పటికీ ఎదిగే ప్రయత్నం చేస్తే.. ఏదోలా తొక్కేయటం అక్కడ అలవాటే. మిగిలిన వర్గాల వారి సంగతి ఎలా ఉన్నా.. పాక్ లోని హిందూ వర్గం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ ఉంటుంది. పుట్టిన గడ్డ మీద అభిమానంతో దేశాన్ని విడవలేక కొందరు.. తమను భారత్ కు వచ్చే అవకాశం కల్పిస్తే..కట్టకట్టుకొని మరీ వచ్చేస్తామంటూ పలువురు హిందువులు వ్యాఖ్యానిస్తుంటారని చెబుతారు. దీనికి తగ్గట్లే దరఖాస్తులు కూడా భారీగా భారత్ కు అందుతుంటాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సుమన్ కుమారి అనే హిందూ మహిళ పాక్ లోని ఒక కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులు కావటం ద్వారా చరిత్రను సృష్టించారు. పాక్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో జడ్జిగా ఎన్నికైన మొట్టమొదటి హిందూ మహిళ సుమన్ కుమారి కావటం గమనార్హం. ఖంబర్ - షాదాద్ కోట్ కు చెందినకుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులయ్యారు.
పాక్ లోని హైదరాబాద్ వర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన ఆమె కరాచీలోని సాజ్ బిస్ట్ వర్సిటీలో లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జడ్జిగా నియమితులు కావటం ద్వారా ఆమె చరిత్ర సృష్టించారు. మహిళల్లో సుమన్ కుమారి కాగా.. పురుషుల్లో జస్టిస్ రానా భగవాన్ దాస్ నిలిచారు. ఆయన 2005 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
ఇక.. సుమన్ కుమారి విషయానికి వస్తే ఆమె సివిల్ జడ్జి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ నియామకాలకు జరిగిన పరీక్షలో 54వ స్థానంలో నిలిచారు. పేదలకు ఉచిత న్యాయ సేవ అందించటం ఇష్టమని చెబుతారు. ఆమె తండ్రి పవన్‌కుమార్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయనకు సుమన్ కుమారి కాకుండా మరో ఇద్దరుకుమార్తెలున్నారు. వారిలో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా.. మరొకరు చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. పాక్ లాంటి దేశంలో ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మరీ.. ఈ స్థానానికి చేరుకోవటం అరుదైన విషయంగా చెబుతున్నారు. సుమన్ కుమారి..కంగ్రాట్స్!