Begin typing your search above and press return to search.

సుకేష్ చంద్రశేఖర్ ట్విస్టు.. హీరోయిన్ పై 100 కోట్లకు దావా

By:  Tupaki Desk   |   12 Feb 2023 1:28 PM GMT
సుకేష్ చంద్రశేఖర్ ట్విస్టు.. హీరోయిన్ పై 100 కోట్లకు దావా
X
తనపై టెలివిజన్ నటి చాహత్ ఖన్నా చేసిన ఆరోపణలను ఉద్దేశించి ఢిల్లీలోని మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ ఒక లేఖ రాసిన వారం అనంత‌రం ఇప్పుడు ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
తనకు వివాహమైందని తెలిసి కూడా చంద్రశేఖర్ తీహార్ జైలులో తనకు ప్రపోజ్ చేశాడని టీవీ న‌టి ఖన్నా గతంలో ఆరోపించింది. దీంతో ఆమె ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ గా 100 కోట్ల మేర ప‌రువు న‌ష్టం కలిగించిందని ప‌రువు న‌ష్టం కేసు వేసారు.

తీహార్ జైలులో ఉన్న అదితి సింగ్-రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య నుండి 200 కోట్ల దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుకేష్ ని విచారిస్తోంది. విచారణ సమయంలో `బడే అచే లాగ్తే హైన్‌` ఫేమ్ టీవీ న‌టి చాహత్ ఖన్నా సహా పలువురు నటీమ‌ణుల‌కు అక్రమార్కుడితో సంబంధాలున్నాయ‌ని ప్ర‌క‌టించిన‌ ఈడీ అప్ప‌ట్లోనే సమన్లు పంపింది.

చంద్రశేఖర్ తరపు న్యాయవాది ఆమె త‌న‌ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఖన్నాను కోరారు. సుకేష్ న్యాయవాది అనంత్ మాలిక్ తన క్లయింట్‌పై ఆరోపణలు చేసినందుకు ఖన్నాకు 100 కోట్ల ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని దావాలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 4 న సుకేష్‌ చంద్రశేఖర్ మీడియాకు ఒక లేఖ రాశారు. చాహత్ ఖన్నాపై `గోల్డ్ డిగ్గర్` అని కామెంట్ చేసాడు. అతను ఆమెకు ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదని పేర్కొన్నాడు.

ఇంతకుముందు చంద్రశేఖర్ గురించి ఖన్నా ఏమన్నారంటే.. కొన్ని సంవత్సరాల క్రితం చంద్రశేఖర్ ను కలవడానికి తాను తీహార్ జైలుకు వెళ్లినట్లు పేర్కొంది., తాను పాఠశాలలో ఒక కార్యక్రమానికి వెళుతున్నానని భావించాను. తనను తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత మేనల్లుడిన‌ని..ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమానిగా పరిచయం చేసుకున్నాడని ఆమె పేర్కొంది. చంద్రశేఖర్ జైలులో కూడా తనకు ప్రపోజ్ చేశాడని ఖన్నా చెప్పారు.

2022 డిసెంబర్ లో మనీలాండరింగ్ కేసులో చంద్రశేఖర్ నుండి ఖరీదైన బహుమతులు అందుకున్నందుకు ED బాలీవుడ్ నటి నోరా ఫతేహి- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల‌కు నోటీసులు పంపింది. అయితే మోసగాడు సుకేష్‌ నుండి నోరాఫతేహి బహుమతులు తీసుకుంద‌న్న ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆమె ప్ర‌త్యారోప‌ణ‌లు చేసారు. కానీ నేరం ద్వారా వ‌చ్చిన‌ ఆదాయం నుండి నోరా- జాకీ ఇరువురు బ‌హుమ‌తులు తీసుకున్నార‌ని ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది.

జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను నిందితురాలిగా పేర్కొంది. ఇల్లు కొనుక్కోవడానికి నోరా ఫతేహీ తన దగ్గర డబ్బులు తీసుకుంద‌ని చంద్రశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. చంద్రశేఖర్ తన స్నేహితురాలిగా మారితే తన ఇంటిని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడని నోరా ఫతేహి గతంలో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ఈ ఆరోపణలపై చంద్రశేఖర్ స్పందిస్తూ.. నోరా సొంత స్థ‌లం మొరాకోలో ఆస్తిని కొనుగోలు చేయడానికి తన నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు నోరా త‌ప్పుడు మాట‌లు మాట్లాడుతోంద‌ని దారి మ‌ళ్లిస్తోంద‌ని అత‌డు ఆరోపించాడు.ఈ కేసును ED అలాగే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారిస్తుండగా.. చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నారు.