Begin typing your search above and press return to search.

విషాదం : తోటి పోలీసుల ముందే రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

By:  Tupaki Desk   |   6 April 2023 5:00 PM GMT
విషాదం : తోటి పోలీసుల ముందే రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
X
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సైగా గత 8 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 55 ఏళ్ల కాసర్ల శ్రీనివాస్ భార్య రాత్రి బాత్రూం లో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను పరామర్శించేందుకు వెళ్లారు. పోలీసులు అందరూ ఉండగానే శ్రీనివాస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గత కొన్నాళ్లుగా ఎస్సై శ్రీనివాస్ మరియు ఆయన భార్య స్వరూపకు గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కుమారులు కూడా హైదరాబాద్‌ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న శ్రీనివాస్ మరియు స్వరూపలు గొడవలు పడుతూ ఉన్నారట. రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఉదయం లేచి వరకు స్వరూప బాత్‌రూం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. తోటి పోలీసులు పరామర్శించేందుకు వచ్చిన సమయంలో శ్రీనివాస్ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన భార్య మరణం తీరని లోటు అంటే పరామర్శించేందుకు వచ్చిన సీఐ.. ఏసీపీ ముందు కన్నీరు పెట్టుకున్నాడు.

ఇంట్లో సీఐ.. ఏసీపీ మరియు ఇతర తోటి పోలీసులు ఉండగానే శ్రీనివాస్ బాత్రూంకు అని వెళ్లాడు. వెంట రివాల్వర్ తీసుకుని వెళ్లి.. కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ దంపతుల కుమారులకు సమాచారం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.