Begin typing your search above and press return to search.

ఆ దేశంలో ఆత్మహత్యలపై నిషేధం

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:00 PM GMT
ఆ దేశంలో ఆత్మహత్యలపై నిషేధం
X
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఏ కీలక నిర్ణయం తీసుకున్న సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల కిమ్ కుమార్తె పేరును ఎవరికి ఉండొద్దు అంటూ నిషేధం విధించారు. పదేళ్ల కిమ్‌ కుమార్తె 'జు ఏ' పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కిమ్ మరో ఆదేశాలతో ఆయన చర్చనీయాంశంగా మారారు.

అదేంటో కాదు... ఉత్తర కొరియాలో ఆత్మహత్యలపై నిషేధం విధించాడు. ఈ మేరకు సీక్రెట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది సోషలిజానికి వ్యతిరేకంగా దేశద్రోహంగా భావించిన కిమ్... ఆత్మహత్యను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా నివేదికలో పేర్కొంది. ఉత్తర కొరియాలో గత ఏడాది కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యలు పెరిగాయని తెలుసుకున్న కిమ్ జోంగ్... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆత్మహత్యల కేసులు 40 శాతం పెరిగాయని తెలుస్తోంది. అక్కడి అధికారులను ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించలేదు. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిమ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచాం.

అందుకోసం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... ఈ ఆదేశాలు జారీ చేశారనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశంలోనే ఆత్మహత్యకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో పెరుగుతున్న అంతర్గత అశాంతి ప్రజల సమస్యలకు కారణమని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఉత్తర కొరియా దేశంలో హింసాత్మక నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని సమాచారం. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ఏడాది మాత్రమే చోంగ్‌జిన్, సమీపంలోని క్యోంగ్‌సాంగ్ కౌంటీలో 35 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయట.

ఈ సంఖ్యను నార్త్ హమ్‌గ్యోంగ్ సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఈ కేసులలో చాలా వరకు మొత్తం కుటుంబాలు కలిసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఆత్మహత్యలపై నిషేదం విధించారు.